Share News

EXAMS : గ్రూప్‌- 2 పరీక్ష ఏర్పాట్ల పరిశీలన

ABN , Publish Date - Feb 22 , 2025 | 12:44 AM

ఏపీపీఎస్సీ ద్వారా ఆదివారం జిల్లాలో జరగనున్న గ్రూప్‌- 2 పరీక్షలకు ఏర్పాట్లను జా యింట్‌ కలెక్టరు శివనారాయణశర్మ పరిశీలించారు. ఆయన శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎస్‌బీఎన, ఎస్వీ కళాశాలలో ఏర్పాట్లను పరిశీ లించారు. ఈసందర్బంగా జేసీ మాట్లాడుతూ గ్రూప్‌-2 పరీక్షలకు సంబం ధించిన ఏర్పాట్లు పూర్తికావాలన్నారు.

EXAMS : గ్రూప్‌- 2 పరీక్ష ఏర్పాట్ల పరిశీలన
JC Shivanarayan Sharma inspecting the arrangements at the examination centers

అనంతపురం టౌన, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ ద్వారా ఆదివారం జిల్లాలో జరగనున్న గ్రూప్‌- 2 పరీక్షలకు ఏర్పాట్లను జా యింట్‌ కలెక్టరు శివనారాయణశర్మ పరిశీలించారు. ఆయన శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎస్‌బీఎన, ఎస్వీ కళాశాలలో ఏర్పాట్లను పరిశీ లించారు. ఈసందర్బంగా జేసీ మాట్లాడుతూ గ్రూప్‌-2 పరీక్షలకు సంబం ధించిన ఏర్పాట్లు శనివారాకి పూర్తికావాలన్నారు. కేంద్రాలు ఉన్న ప్రతి కళాశాలలోను సీసీకెమెరాలు ఏర్పాటుచేసి, అన్నీ పనిచే సే లా చూడాలన్నారు. పరీక్ష రోజు ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన అమ లుచేయాలని, సమీపంలో ఉన్న జిరాక్స్‌ సెంటర్లను మూసి వేయించా లని పోలీసులకు సూచించారు. పరీక్షలకు హాజయర్యేందుకు వచ్చే అభ్యర్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టరు తిప్పేనాయక్‌, జడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 22 , 2025 | 12:44 AM