COLLECTOR : ఈ - పంట నమోదు పక్కాగా నిర్వహించాలి
ABN , Publish Date - Feb 22 , 2025 | 12:40 AM
జిల్లాలో ఈ పంట నమోదు పక్కగా నిర్వహించాలని కలెక్టర్ వినోద్‌కుమార్ సూచించారు. ఆయన శుక్రవారం మండలంలోని కందుకూరు, సోములదొడ్డి గ్రామా ల్లో ఈ - క్రాప్ బుకింగ్ సూపర్ చెక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముం దుగా కందుకూరులో వై మురళీకృష్ణ సాగు చేసిన మొక్క జొన్న పంట ఈ- క్రాప్ బుకింగ్‌లో కలెక్టర్ సూపర్ చెక్ నిర్వహించారు.
కలెక్టర్ వినోద్‌కుమార్ ఫ సూపర్ చెక్ పరిశీలన
అనంతపురం రూరల్, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ పంట నమోదు పక్కగా నిర్వహించాలని కలెక్టర్ వినోద్‌కుమార్ సూచించారు. ఆయన శుక్రవారం మండలంలోని కందుకూరు, సోములదొడ్డి గ్రామా ల్లో ఈ - క్రాప్ బుకింగ్ సూపర్ చెక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముం దుగా కందుకూరులో వై మురళీకృష్ణ సాగు చేసిన మొక్క జొన్న పంట ఈ- క్రాప్ బుకింగ్‌లో కలెక్టర్ సూపర్ చెక్ నిర్వహించారు. అనం తరం సోములదొడ్డి గ్రామ పరిధిలోని రఘురాములు సాగు చేసిన వరి పంట ఈ క్రాప్ బుకింగ్‌ను సూపర్ చెక్ చేశారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ... రబీ సీజనకు సంబంధించి ఈ - క్రాప్ నమోదు ను పక్కాగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే సూపర్ చెక్‌ను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, ఏడీ రవికుమార్, తహసీల్దార్ హరికుమార్, మండల వ్యవసాయాధికారి శశికళ, బాలనాయక్, ఏఈఓ మురళీకృష్ణ, ఆర్‌ఐ సందీప్, విఆర్వోలు గోవిందు నాయక్, సర్వేయర్ రఘు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....