Share News

AP NEWS: ఉత్కంఠగా హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం

ABN , Publish Date - May 12 , 2025 | 09:16 AM

Hindupuram News: హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లాపై అవిశ్వాసాన్ని సోమవారం ప్రవేశపెట్టనున్నారు. ఈ అవిశ్వాసం తీవ్ర ఉత్కంఠగా మారింది. దీంతో హిందూపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

AP NEWS:  ఉత్కంఠగా హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం
Hindupuram NEWS

శ్రీ సత్యసాయి జిల్లా: హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లాపై అవిశ్వాసాన్ని ఇవాళ(సోమవారం) ప్రవేశ పెట్టనున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవీకాలం నాలుగు సంవత్సరాలు పూర్తవడంతో... అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్లు రెడీ అయ్యారు. ఇప్పటికే అవిశ్వాస తీర్మానంపై కౌన్సిలర్లు సంతకాలతో అమోదం తెలిపారు. ఈ నోటీసులను జిల్లా కలెక్టర్‌కు కౌన్సిలర్లు ఇచ్చారు. దీంతో ఇవాళ(మే12) కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. మొత్తం హిందూపురం మున్సిపాలిటీలో 38 మంది కౌన్సిలర్లు ఉండగా ఎంపీ, ఎమ్మెల్యే ఓటుతో కలిపి 40 మంది ఉన్నారు.


వీరిలో టీడీపీ బలం 22 మంది కౌన్సిలర్లు ఉండగా.. వైసీపీకి 16 మంది సభ్యుల బలం ఉంది. అవిశ్వాస తీర్మానంపై ఏర్పాటైన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగాలంటే 27 మంది సభ్యుల కోరం అనుమతి తప్పనిసరి కానుంది. హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందడంతో వైస్ చైర్మన్ విషయంలో వైసీపీ నాయకులు అప్రమత్తమయ్యారు. వైసీపీ కౌన్సిలర్లు 16 మందిని ఓ ప్రత్యేక క్యాంపునకు ఆ పార్టీ అగ్ర నేతలు తరలించారు. వైసీపీ కౌన్సిలర్లను గోవాకు తరలించినట్లు సమాచారం. ప్రత్యేక సమావేశానికి 27 మంది సభ్యుల కోరం తప్పనిసరి కానుంది. సరిపడని కోరం లేకపోతే ఈ సమావేశం వాయిదా పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశం తీవ్ర ఉత్కంఠగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

India- Pakistan War: రెండు దేశాల మధ్య కీలక చర్చలు

టిబెట్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి

ED Summons: సినీ నటుడు మహేష్ బాబుకు మరోసారి ఈడీ నోటీసులు..

For More AP News and Telugu News

Updated Date - May 12 , 2025 | 10:04 AM