MLA : పరిశుభ్రతతోనే అభివృద్ధి: శ్రావణి
ABN , Publish Date - Jan 19 , 2025 | 01:19 AM
పరిశుభ్రమైన వాతవర ణం గ్రామాల అభివృద్ధికి తోర్పడుతుందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. నియోజకవర్గం కేంద్రమైన శింగనమలలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించా రు.
శింగనమల, జనవరి 18(ఆంధ్రజ్యోతి): పరిశుభ్రమైన వాతవర ణం గ్రామాల అభివృద్ధికి తోర్పడుతుందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. నియోజకవర్గం కేంద్రమైన శింగనమలలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో కలసి చీపురుపట్టి అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతంలో చెత్తను ఊడ్చారు. తహసీల్దార్ సాకే బ్రహ్మయ్య, ఎంపీడీఓ, నిర్మలా కుమారి, ఈఓపీఆర్‌డీ, వెంకట లక్ష్మి, ఇతర అధికారులు, టీడీపీ నాయకులు డేగల కృష్ణ మూర్తి మూరుతినాయుడు, మాసూలచంద్ర తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....