Share News

CULTURAL : అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:35 AM

నగర శివార్లలోని శిల్పారామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను అలరించాయి. సంక్రాంతి పండుగ ను పురస్కరించుకుని శిల్పారామం ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

CULTURAL : అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
Artists performing dance

అనంతపురం రూరల్‌, జనవరి 15(ఆంధ్రజ్యోతి): నగర శివార్లలోని శిల్పారామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను అలరించాయి. సంక్రాంతి పండుగ ను పురస్కరించుకుని శిల్పారామం ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా మంగళవారం ధర్మవరానికి చెందిన శ్రీ లలిత నాట్య కళానికేత ఆధ్వర్యంలో నృత్య గురువు బాబు బాలాజీ శిష్య బృందం వివిధ సాంస్కృతి కార్యక్రమాలు ప్రదర్శించారు. వినాయక స్తుతి, లింగాష్టకం, కుంభజ్యోతి నాట్యం, కోలాటం, లంబాడి నాట్యం, సంక్రాంతి నృత్యం వంటివాటిని ప్రదర్శించారు. అదేవిధంగా బుధవా రం మైదుకూరుకు చెందిన ఇంద్రజాలికులు ఇంద్రజాల ప్రదర్శనలు నిర్వహించారు. చిన్నారులు గాలిపటాలు ఎగురవేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు రామలాలిత్య, లీలమాధవి, ఇందు ప్రణీత, యశశ్రీ, రాజస్వి, అర్యన, దేవిసుత్తి, యశస్వీనీ, లాస్య, హర్షిణి ప్రియ ముత్యభావన, ధ్రువశ్రీ, తన్విక, కీర్తన, మోక్షిత పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 16 , 2025 | 12:35 AM