Share News

MLA : మరువకొమ్మ వద్ద ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మించండి

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:52 AM

స్థానిక శిం గనమల శ్రీరంగనా యక చెరువు మరువకొమ్మ రో డ్డు వద్ద ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఎమ్మె ల్యే బండారు శ్రావణిశ్రీ ఆర్‌ ఆండ్‌ బీ శాఖ మం త్రి బీసీ జనార్దన రెడ్డికి విన్నవించారు. విజయ వాడలో మంత్రిని గురు వారం కలసి నియోజకవర్గంలోని రహదారుల సమస్యలపై వివరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

MLA : మరువకొమ్మ వద్ద ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మించండి
MLA making a plea with Minister Janardhana Reddy

- ఆర్‌ ఆండ్‌ బీ మంత్రికి ఎమ్మెల్యే శ్రావణిశ్రీ విన్నపం

శింగనమల, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక శిం గనమల శ్రీరంగనా యక చెరువు మరువకొమ్మ రో డ్డు వద్ద ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఎమ్మె ల్యే బండారు శ్రావణిశ్రీ ఆర్‌ ఆండ్‌ బీ శాఖ మం త్రి బీసీ జనార్దన రెడ్డికి విన్నవించారు. విజయ వాడలో మంత్రిని గురు వారం కలసి నియోజకవర్గంలోని రహదారుల సమస్యలపై వివరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్బంగా ఆ మె మాట్లాడుతూ శింగనమల నియోజకవర్గం పరిధిలోని బుక్కరాయ సముద్రం, శింగనమల, నార్పల మండలాల్లో ఆమరావతికి ఆరు వరుసల రోడ్డు పనులు జరుగుతున్నా యని తెలిపారు. ముఖ్యంగా శింగనమల చెరువు మరవకొమ్మ వద్ద నియోజకవర్గం కేంద్రమైన శింగనమలకు వెళ్లేందుకు సరైన రోడ్డును అధికారులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కావున మరువకొమ్మ వద్ద ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్‌స్టాప్‌ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే శింగన మల చెరువు నిండి మరువ పారితే శింగనమల, గార్లదిన్నె, అనంతపురా నికి రాకపోకలు నిలిపోతాయన్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు కలుగకుం డా అక్కడ రోడ్డుపైన ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మించేందుకు నిధులు మంజారు చేయాలని కోరారు. అలాగే నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి మరమ్మతులకు నిధులు కేటాయించాలని మంత్రిని కోరారు. సమస్యలపై మంత్రి సానుకూలంగా సృందించారని ఎమ్మెల్యే పెర్కొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 07 , 2025 | 12:52 AM