Share News

MLA: పారిశ్రామిక రంగానికి వెలుగులు తెస్తున్నారు

ABN , Publish Date - Jan 28 , 2025 | 12:28 AM

పారిశ్రామిక రంగా నికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ వెలుగులు తెస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యా దవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరితో కలిసి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.

MLA: పారిశ్రామిక రంగానికి వెలుగులు తెస్తున్నారు
MLA Daggupati Venkateswara Prasad talking to the media

ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌

అనంతపురం అర్బన, జనవరి 27(ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక రంగా నికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ వెలుగులు తెస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యా దవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరితో కలిసి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు, నారా లోకేశ దావోస్‌ పర్యటన విజయ వంత అయిందన్నారు. వైసీపీ ఐదేళ్లల్లో తీసుకురాలేని పెట్టుబడులను ఏడు నెలల్లోనే తీసుకొస్తున్నారన్నారు. దావోస్‌లోని పారిశ్రామిక వేత్తలను కలిసి రాష్ట్రం లోని వనరులను వివరించి పెట్టుబడులను ఆకర్షించార న్నారు. ఏపీతో పాటు దేశంలోనే పెట్టుబడులు పెట్టాలని సీఎం మా ట్లాడిన తీరును ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారన్నారు. జిల్లాకు కూడా పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. యువతలో నైపుణ్యాన్ని పెంపొందిం చేందుకు ప్రత్యేక శిక్షణలు ఇస్తారని, యువత సద్వినియోగం చేసుకోవాల ని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి, నాయకులు తలారి ఆదినారాయణ, బుగ్గయ్య చౌదరి, ముంటిమడుగు కేశవరెడ్డి, సరిపూటి రమణ, కూచి హరి, స్వామిదాస్‌, వెంకటప్ప, సంగా తేజస్విని, వడ్డే భవానీ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 28 , 2025 | 12:28 AM