Share News

STRIKE : 24, 25న బ్యాంకు ఉద్యోగుల సమ్మె

ABN , Publish Date - Mar 07 , 2025 | 11:52 PM

బ్యాంకుల్లో ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేసి శాశ్వత ప్రాతిపదికన ఖాళీల భర్తీ చేపట్టాలని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూనియన్స నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ నెల 24, 25వ తేదీలలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం సాయంత్రం స్థానిక సాయినగర్‌లోని స్టేట్‌ బ్యాం కు ఆఫ్‌ ఇండియా ఎదుట సన్నాహక నిరసన నిర్వహించారు.

STRIKE : 24, 25న బ్యాంకు ఉద్యోగుల సమ్మె
Bank employees protesting in front of SBI in Sainagar

- సాయినగర్‌ ఎస్‌బీఐ ఎదుట సన్నాహక నిరసన

అనంతపురం క్లాక్‌టవర్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): బ్యాంకుల్లో ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేసి శాశ్వత ప్రాతిపదికన ఖాళీల భర్తీ చేపట్టాలని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూనియన్స నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ నెల 24, 25వ తేదీలలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం సాయంత్రం స్థానిక సాయినగర్‌లోని స్టేట్‌ బ్యాం కు ఆఫ్‌ ఇండియా ఎదుట సన్నాహక నిరసన నిర్వహించారు. ఈ సం దర్భంగా బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. పలు డిమాండ్లపై దేశ వ్యాప్తంగా సమారు 10లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు భాగస్వామ్యంతో ఈనెల 24, 25 తేదీలలో చేపట్టే సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. సంఘం నాయకులు ఖాదర్‌భాషా, చంద్రమో హన, రాఘురామ్‌ యాదవ్‌, చంద్రశేఖర్‌, నరేంద్ర, మారుతి, నటరాజ్‌, జయకృష్ణ, షాజహానబాబు, రమేష్‌, మహేంద్ర, జీఎల్‌ఎన రెడ్డి, గౌస్‌ఖాన, అనూషా, నీలిమ, భారతి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 07 , 2025 | 11:52 PM