Paritala Sunitha : మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా..?
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:19 AM
వేతనాల కోసం రోడ్డెక్కి పోరాటం చేస్తున్న మహిళల్ని జగన జైలుకు పంపారని, సొంత తల్లి, చెల్లిని ఆస్తుల కోసం కోర్టుకు లాగారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు. అలాంటి వ్యక్తికి మహిళల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. అసెంబ్లీలో బుధవారం మహిళా సాధికారత అంశంపై ఆమె మాట్లాడారు. బడ్జెట్‌లో మహిళా శిశు సంక్షేమానికి రూ.4,300 కోట్లు కేటాయించారని, ఇది మహిళా బడ్జెట్ అని అన్నారు. గత ...

జగనపై మండిపడ్డ ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం, మార్చి 12(ఆంధ్రజ్యోతి): వేతనాల కోసం రోడ్డెక్కి పోరాటం చేస్తున్న మహిళల్ని జగన జైలుకు పంపారని, సొంత తల్లి, చెల్లిని ఆస్తుల కోసం కోర్టుకు లాగారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు. అలాంటి వ్యక్తికి మహిళల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. అసెంబ్లీలో బుధవారం మహిళా సాధికారత అంశంపై ఆమె మాట్లాడారు. బడ్జెట్‌లో మహిళా శిశు సంక్షేమానికి రూ.4,300 కోట్లు కేటాయించారని, ఇది మహిళా బడ్జెట్ అని అన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడా మహిళలకు ప్రాధాన్యమివ్వలేదని అన్నారు. ఉచితంగా ఇళ్లు ఇస్తానని నమ్మించి జగన మోసం చేశారని అన్నారు. పెళ్లి కానుకలు రద్దు చేశారని, మహిళల కోసం గతంలో ఉన్న పథకాలన్నీ తొలగించారని అన్నారు. అంగనవాడీలు, ఆశా వర్కర్లు వేతనాల కోసం నడిరోడ్డుపై రోజుల తరబడి ఉద్యమం చేసినా
స్పందించలేదని, పైగా ఎస్మా పెట్టాలని చూశారని మండిపడ్డారు. ఇలాంటి పనులు చేసిన జగన రెడ్డి మహిళల సాధికారత కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. వైసీపీ హయాంలో మహిళలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహిళను హోంమంత్రిగా చేసి, ఆమె చేతికి అధికారం ఇవ్వకుండా చేసిన చరిత్ర జగనదనని అన్నారు. తమ ముఖ్యమంత్రి మహిళను హోంమంత్రిగా చేయడంతో పాటు ఆమెకు ఆ శాఖ పట్ల పూర్తి బాధ్యతలు ఇచ్చారని అన్నారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా హోంమంత్రి అనిత వెంటనే స్పందించడం గర్వకారణమని అన్నారు. పది ఎకరాల్లోపు ఉన్నరైతులకు 90 శాతం సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీలకు వందశాతం సబ్సిడీతో డ్రిప్, స్ర్పింక్లర్లు ఇవ్వడానికి అనుమతులిచ్చినందుకు సీఎం చంద్రబాబుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....