RTC : 170 మందికి ఉచిత వైద్య పరీక్షలు
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:16 AM
ఆర్టీసీకి చెందిన 170 మంది సిబ్బందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్టీసీ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం అనంతపురం డిపో గ్యారేజీ ఆవరణలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 170 మంది ఆర్టీసీ సిబ్బంది పాల్గొని గుండె, డయాబెటిస్, కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీకి చెందిన 170 మంది సిబ్బందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్టీసీ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం అనంతపురం డిపో గ్యారేజీ ఆవరణలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 170 మంది ఆర్టీసీ సిబ్బంది పాల్గొని గుండె, డయాబెటిస్, కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అవసరమున్న వారికి మందులను అందజేశారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు మురళీకృష్ణ, నిరంజనరెడ్డి, ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఆర్‌ఎంఓ హేమలత, బస్టాండు మేనేజర్ కేఎన మూర్తి, ఎస్టీఐ రామాంజనేయులు, ఎంఎఫ్ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....