Ycp : యువత లేని పోరు..!
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:33 AM
వైసీపీ చేపట్టిన యువత పోరులో యువత పెద్దగా కనిపించలేదు. వైసీపీ నాయకులకే కాలేజీలు ఉన్నా.. విద్యార్థులు కూడా రాలేదు. విద్యార్థి, యువత సమస్యలపై పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంతవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నగరంలో ‘యువత పోరు’ పేరిట కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద అనంత వెంకటరామిరెడ్డి ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అనంత ...

వైసీపీ ఆందోళనకు శ్రేణులు దూరం
విద్యార్థుల కోసంఎస్‌ఎ్‌సబీఎన వద్ద వాగ్వాదం
ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలి
వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి
అనంతపురం క్రైం, మార్చి 12(ఆంధ్రజ్యోతి): వైసీపీ చేపట్టిన యువత పోరులో యువత పెద్దగా కనిపించలేదు. వైసీపీ నాయకులకే కాలేజీలు ఉన్నా.. విద్యార్థులు కూడా రాలేదు. విద్యార్థి, యువత సమస్యలపై పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంతవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నగరంలో ‘యువత పోరు’ పేరిట కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద అనంత వెంకటరామిరెడ్డి ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అనంత అన్నారు. ప్రభుత్వం చెల్లించకపోవడంతో అప్పులు చేసి ఫీజు కడుతున్నారని అన్నారు. యువతకు ఇచ్చిన హామీలను కూడా ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. నిరుద్యోగ భృతికి బడ్జెట్ కేటాయించలేదని అన్నారు. వైసీపీ హయాంలో 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టామని, అందులో
ప్రారంభించిన ఐదు కాలేజీలను ఈ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని ఆరోపించారు. మెడికల్ కళాశాలలను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మంగమ్మ, శివరామిరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన గిరిజమ్మ, నియోజకవర్గాల ఇనచార్జ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాలేజీలో రాజకీయాలా..?
వైసీసీ ర్యాలీ జరిగే సమయంలో ఎస్‌ఎ్‌సబీఎన కళాశాల వద్ద వాగ్వాదం జరిగింది. విద్యార్థులను పంపేందుకు ప్రిన్సిపాల్ నిరాకరించడంతో ‘కూటమి ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారా..?’ అని వైసీపీ నాయకులు ప్రశ్నించారు. తమకు రాజకీయాలు అవసరం లేదని, పిల్లలు ఇబ్బంది పడతారని ప్రిన్సిపాల్ వారితో అన్నారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దని, బయటకెళ్లాలని టూటౌన సీఐ శ్రీకాంత సూచించారు. ర్యాలీలు బయట చేసుకోవాలని, కళాశాలలో కాదని సీఐ స్పష్టం చేయడంతో వెనుదిరిగారు.
గుంపులో గోవింద
ఐదేళ్లూ అధికారం అనుభవించిన వైసీపీ నేతలు యువత పోరులో గుంపులో గోవింద అన్నట్లు వ్యవహరించారు. ముఖ్య నాయకులు వచ్చినా, శ్రేణులను రప్పించలేదు. మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఇప్పటివరకు పార్టీ కార్యాక్రమాల్లో ఒక్కసారీ పాల్గొనలేదు. యువత పోరుకూ డుమ్మా కొట్టారు. ఆమె భర్త సాంబశివారెడ్డి తన కాలేజీ నుంచి కూడా విద్యార్థులను పిలిపించలేదు. పార్టీ నాయకులు అడిగితే.. ‘కుదరలేదు..’ అని చెప్పారట. కళాశాలల్లో భాగస్వామ్యం ఉన్న మరో ఇద్దరు నేతలు సైతం సరిగా స్పందించలేదని తెలిసింది. గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి జెడ్పీ కార్యాలయం వద్ద విగ్రహాలకు నివాళులు అర్పించాక.. అక్కడే ఉండిపోయారు. ర్యాలీ ముగిశాక కలెక్టరేట్‌కు వెళ్లారు. కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు పెద్దగా రాలేదు. శింగనమల, రాయదుర్గం ప్రాంతాల నుంచి కొంతవరకు వచ్చారు.
ట్రాఫిక్ జామ్
వైసీపీ యువత పోరు కారణంగా నగరంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. జెడ్పీ కార్యాలయం, సూర్యానగర్, అశోక్ నగర్ వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఇంటర్ విద్యార్థులను తీసుకెళ్లే బస్సులు నిలిచిపోవడంతో సాయినగర్, సప్తగిరి సర్కిల్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....