Share News

Ananthapuram News: ఈ పాపను తీసుకెళ్లండి...

ABN , Publish Date - Nov 26 , 2025 | 10:52 AM

తగిన ఆధారాలు చూపించి పాపను తీసుకెళ్లాలని ఐసీడీఎస్‌ పీడీ అరుణకుమారి కోరారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ... జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని శిశుగృహలో సంరక్షణ పొందుతున్న 60రోజుల చిన్నారిని తగిన ఆధారాలు సమర్పించి తీసుకెళ్లవచ్చునని కోరారు.

Ananthapuram News: ఈ పాపను తీసుకెళ్లండి...

- ఐసీడీఎస్‌ పీడీ అరుణకుమారి

అనంతపురం: జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని శిశుగృహలో సంరక్షణ పొందుతున్న 60రోజుల చిన్నారిని సబంధిత తల్లిదండ్రు, రక్తసంబంధీకులు తగిన ఆధారాలు సమర్పించి తీసుకెళ్లవచ్చునని ఐసీడీఎస్‌ పీడీ అరుణకుమారి(ICDS PO Aruna Kumari) బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు నెలల క్రితం నగరంలోని సాయినగర్‌ 7వ క్రాస్‌లో నవజాత శిశువు(అమ్మాయి)ను వదిలేసి వెళ్లిపోయారన్నారు. సమాచారముందుకు వైద్యపరీక్షలు చేయించి శిశుగృహలో సంరక్షించడం జరుగుతోందన్నారు.


అమ్మాయికి సంబంధిత తల్లిదండ్రులకు, రక్తసంబందీకులు 30రోజులలోపు రాకపోతే నిబంధనల మేరకు అనాథగ ప్రకటిస్తామన్నారు. అనంతరం దత్తకోరు తల్లిదండ్రులకు చట్టబద్దంగా దత్తత ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. వివరాలకు ఐడీసీఎస్‌ పీడీ కార్యాయాన్ని సంప్రదించాలని కోరారు.


41 దరఖాస్తులు..

మహిళ, శిశు శాఖ ఆధ్వర్యంలో సఖి(వన్‌స్టాప్) సెంటర్‌లోని పోస్టులకు 41 దరఖాస్తులు వచ్చినట్లు ఐసీడీఎస్‌ పీడీ ఆరుణకుమారి మంగళవారం ప్రకటనలో తెలిపారు. 15నుంచి 25వ తేదీ వరకు ఫిజియో సోషల్‌ కౌన్సిలర్‌కు ఏడు, మల్లీపర్పసర్‌ స్టాఫ్‌/కుక్‌కు 11, సెక్యూరిటీ గార్డ్‌/ నైట్‌వాచ్‌మెన్‌కు 23 మొత్తం 41మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. ఎంపిక స్ర్కూటిని తదితర వివరాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇవాళ పెరిగిన వెండి, బంగారం ధరలు

మావోయిస్టుల కస్టడీ పిటిషన్‌ వెనక్కి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 26 , 2025 | 10:52 AM