Share News

Anantapur: హమ్మయ్యా.. బతికిపోయాలే...

ABN , Publish Date - Sep 09 , 2025 | 01:01 PM

మేత మేస్తూ ఓ పాడి గేదె ప్రమాదవశాత్తు బావిలో పడింది. అందులో నీళ్లు ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. కానీ బయటకు వచ్చే మార్గం కాన రాక ఆ గేదె నీళ్లలోనే ఈదుకుంటూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత రైతు గేదె కోసం వెతకగా బావిలో కనిపించింది.

Anantapur: హమ్మయ్యా.. బతికిపోయాలే...

ధర్మవరం(అనంతపురం): మేత మేస్తూ ఓ పాడి గేదె ప్రమాదవశాత్తు బావిలో పడింది. అందులో నీళ్లు ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. కానీ బయటకు వచ్చే మార్గం కాన రాక ఆ గేదె నీళ్లలోనే ఈదుకుంటూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత రైతు గేదె కోసం వెతకగా బావిలో కనిపించింది. దీంతో ఆయన గ్రామస్థుల సాయంతో క్రేన్‌ను తెప్పించారు. దాని ద్వారా తాళ్లను కట్టి గేదెను ఒడ్డుకు చేర్చారు. గేదెను రూ.1.5 లక్షలకు కొనుగోలు చేసినట్లు రైతు కత్తే తిమ్మన్న తెలిపాడు. ఈ సంఘటన మండలంలోని కత్తే కొట్టాల(Katte Kottala) గ్రామంలో సోమవారం జరిగింది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

విద్యుత్తు రంగ కమిటీల పునర్వ్యవస్థీకరణ

Read Latest Telangana News and National News

Updated Date - Sep 09 , 2025 | 01:01 PM