Share News

Ananthapur: సార్‌.. చేతులెత్తి మొక్కుతాం.. న్యాయం చేయండి

ABN , Publish Date - Aug 30 , 2025 | 12:20 PM

‘సార్‌..! మీకు చేతులెత్తి మొక్కుతాం. మాకు న్యాయం చేయండి. మేం పండించిన పంటలను వ్యాపారులు, దళారులు న్యాయంగా కొనేలా చర్యలు తీసుకోండి’ అంటూ తూనికలు కొలతలు అధికారి శంకర్‌ను మండలంలోని పాల్తూరు రైతులు కోరారు. గ్రామంలో వేరుశనగ తూకాల్లో బాదు పేరిట జరు గుతున్న మోసంపై ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం ఓ కథనం ప్రచురితమైన విషయం తెలిసింది.

Ananthapur: సార్‌.. చేతులెత్తి మొక్కుతాం.. న్యాయం చేయండి

- తూనికలు, కొలతలు అధికారికి రైతుల విన్నపం

విడపనకల్లు(అనంతపురం): ‘సార్‌..! మీకు చేతులెత్తి మొక్కుతాం. మాకు న్యాయం చేయండి. మేం పండించిన పంటలను వ్యాపారులు, దళారులు న్యాయంగా కొనేలా చర్యలు తీసుకోండి’ అంటూ తూనికలు కొలతలు అధికారి శంకర్‌ను మండలంలోని పాల్తూరు రైతులు కోరారు. గ్రామంలో వేరుశనగ తూకాల్లో బాదు పేరిట జరు గుతున్న మోసంపై ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం ఓ కథనం ప్రచురితమైన విషయం తెలిసింది.


దీనికి స్పందించిన జాయింట్‌ కలెక్టర్‌ తూనికలు కొలతల శాఖ అధికారులను పాల్తూరు గ్రామానికి పంపారు. దీంతో తూనికలు కొలతలశాఖ అధికారులు శుక్రవారం ఉదయం పాల్తూరు గ్రామం చేరుకుని రైతులతో చర్చించారు. వ్యాపారులను పిలిపించి ఎక్కడైనా సరే 40 కిలోల బస్తాకు 2 కిలోలకు మించి బాదును తీసుకుంటే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. లారీలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. మారయ్య పొలంలో ఓ వ్యాపారి 43.5 కిలోల తూకం పట్టిన విషయాన్ని గమనించిన అధికారి తిరిగి వాటిని 42 కిలోలకు మార్పించారు.


వేరుశనగ కాయలు వేస్తున్న ఖాళీ బ్యాగులు ఉల్లిగడ్డలు వేసే బ్యాగులు కావటంతో కనీసం 10 గ్రాములు కూడా లేని సంచికి అరకిలో బాదు తీయటం ఏంటి అని వ్యాపారులను ప్రశ్నించారు. రైతుల పొలాలు వద్దకే తూనికలు కొలతలశాఖ అధికారులు వెళ్లి ఏ వ్యాపారి వచ్చినా 42కిలోలకు కిలో కూడా ఎక్కువ ఇవ్వద్దు అని సూచించారు. ఎవరైనా అధికంగా డిమాండ్‌ చేస్తే తమకు ఫోన్‌ చేయమని నంబర్లను ఇచ్చారు. ‘వర్షాలు పడుతున్నాయి. పొలాల్లోనే రాశులు వేసుకున్నాము. దిగుబడి తడిస్తే నష్టపోతాము. ప్రభుత్వం తరఫున వేరుశనగ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోండి’ అంటూ పలువురు రైతులు వేడుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇన్‌ఫార్మర్‌ నెపంతో గిరిజనుడి హత్య

గణేశుడి మండపం వద్ద కరెంట్‌ షాక్‌తో బాలుడి మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 30 , 2025 | 12:20 PM