Vijayawada : రాజధాని టవర్లలో నీటి తోడివేత
ABN , Publish Date - Jan 28 , 2025 | 05:00 AM
ఫిబ్రవరి తొలివారానికి 4 సచివాలయ టవర్ల నుంచి నీటిని పూర్తి తోడివేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
1, 2 టవర్లలో తోడకం పూర్తి .. 3, 4 టవర్లలో తుది దశకు
ఫిబ్రవరి తొలివారానికి పనులు ముగించాలని లక్ష్యం
విజయవాడ, జనవరి 27(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో కీలకమైన సచివాలయ టవర్లలో నిలిచిన నీటి తోడివేత పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి తొలివారానికి 4 సచివాలయ టవర్ల నుంచి నీటిని పూర్తి తోడివేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు మొదటి, రెండవ టవర్లలో నీటిని పూర్తిగా తొలగించారు. నీటిని తోడివేసిన నేపథ్యంలో నేల గట్టిపడాల్సి ఉంది. మూడు, నాల్గవ టవర్లలో కొంత మేర నీటిని తొలగించాల్సి ఉంది. హైకోర్టు నిర్మాణ ప్రాంతంలో కూడా స్వల్పంగా నీరు ఉండడంతో తోడివేత పనులను వేగంగా పూర్తి చేసేందుకు అత్యధిక హార్స్ పవర్‌తో కూడిన మోటర్లను వినియోగిస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారం నాటికి నీటిని పూర్తిగా తోడివేశాక.. రెండో వారంలోనే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాలకు సంబంధించి పీఎంసీల నియామకాలు పూర్తి చేయనున్నారు. పునర్నిర్మాణ పనులు చేపట్టడానికి ఈ పీఎంసీలే టెండర్లకు రూపకల్పన చేస్తాయి. ఆ మేరకు కొత్తగా టెండర్లు పిలవనున్నారు. టెండర్లు పిలిచిన రెండేళ్లలో పనులు పూర్తయ్యేలా లక్ష్యాన్ని నిర్దేశించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News