Govt Officials : ఏపీసీవోఎస్‌టీలో అక్రమాలు!
ABN , Publish Date - Feb 03 , 2025 | 04:23 AM
ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఏపీసీవోఎస్‌టీ)లో గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గత ప్రభుత్వంలో సభ్య కార్యదర్శి ఇష్టారాజ్యం
స్నేహితురాలికి అర్హతలేకున్నా ఏవోగా నియామకం
ఏవోకు ప్రస్తుత సీఎంవోలోని ఓ అధికారి అండ
కూటమి ప్రభుత్వ పెద్దలకు తాజాగా ఫిర్యాదులు
అమరావతి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): అటవీశాఖ అనుబంధ విభాగమైన ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఏపీసీవోఎస్‌టీ)లో గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ భవానీపురంలో ఉన్న కార్యాలయంలో గత ప్రభుత్వంలో సీఎంవోలో పని చేసి గతేడాది రిటైరైన ఐఏఎస్ అధికారి సతీమణి ప్రొఫెసర్‌గా తెలంగాణాలో పనిచేస్తూ, డిప్యుటేషన్‌పై వచ్చి, ఏపీసీవోఎ్‌సటీ సభ్య కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు తాజాగా కూటమి ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు అందాయి. భర్త అండతో ఆమె చెలరేగిపోయినట్లు తెలిసింది. అప్పట్లో రాష్ట్ర సచివాలయంలో పని చేసే, తన స్నేహితురాలైన మహిళా సెక్షన్ ఆఫీసర్‌ను ఏపీసీవోఎ్‌సటీ పరిపాలనాధికారిగా నియమించారు. ఆమె ఏపీసీవోఎ్‌సటీ పరిపాలనాధికారి పోస్టుకు సాంకేతికపరంగా అర్హురాలు కాకున్నా.. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమార్గంలో ఆ సీటు అప్పగించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. రెగ్యులర్ ఉద్యోగుల్ని పక్కన పెట్టి, క్లాస్4 ఉద్యోగుల్ని పునర్నియమించి, వారి ద్వారా అక్రమాలకు సాగించారని ఆరోపణలున్నాయి. ఇద్దరు క్లాస్4 ఉద్యోగులకు ఇప్పటికీ నియామక పత్రాలు లేవని సమాచారం. ఈ నేపథ్యంలో ఏపీసీవోఎ్‌సటీలో తప్పుడు విధానాలను ఆడిట్ విభాగం రిమార్కులు రాసినట్లు తెలిసింది.
కోర్టు కేసు విషయంలో అటవీశాఖకు ప్రభుత్వ న్యాయవాది ఉండగా, పరిపాలనాధికారి ప్రభుత్వ ధనం రూ.2లక్షలు ఖర్చు పెట్టి, ప్రైవేటు లాయర్‌ను ఖర్చు పెట్టినట్లు ఆడిట్ నివేదిక తేల్చినట్లు తెలిసింది. రిటైరైన ఉద్యోగులకు జీపీఎఫ్ సొమ్ము చెల్లింపులకు ముడుపులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఏపీసీవోఎ్‌సటీలో వివాదాలకు పరిపాలనాధికారి కేంద్రబిందువుగా మారినట్లు అటవీశాఖలో చర్చ నడుస్తోంది. ఐఏఎస్ అధికారి సతీమణి సభ్య కార్యదర్శి సీటు నుంచి వెళ్లిపోయినా ఆమె హయాంలోని ఫైళ్ల విషయంలోనూ గోప్యత పాటిస్తూ, ఆర్టీఐ ద్వారా పలువురు సమాచారం అడిగినా ఇవ్వకుండా సాకులు చెప్తున్నారు. పరిపాలనాధికారికి ప్రస్తుత సీఎంవోలోని ఓ అధికారి సహకరిస్తుండటం వల్లే ఆమె ఇంకా కొనసాగుతున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో ఏపీసీవోఎ్‌సటీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపితే.. వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కూటమి ప్రభుత్వానికి తాజాగా ఫిర్యాదులందాయి.
ఈ వార్తలు కూడా చదవండి
Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...
Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం
Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News and Telugu News