Manchu Manoj: సిద్దేశ్వరుడి దర్శనం.. అదృష్టం
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:14 PM
హేమావతిలో మానవాకృతిలో సిద్దేశ్వరున్ని దర్శించుకోవడం చాలా అదృష్టమని సినీనటుడు మంచు మనోజ్ పేర్కొన్నారు. మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన హేమావతి సిద్దేశ్వరస్వామి ఆలయాన్ని ఆయన తన భార్య భూమా మౌనికరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ఉమాదేవి దంపతులతో కలిసి శుక్రవారం సందర్శించారు. వారికి హేమావతి పంచాయతీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
- సినీ నటుడు మంచు మనోజ్
అమరాపురం: హేమావతిలో మానవాకృతిలో సిద్దేశ్వరున్ని దర్శించుకోవడం చాలా అదృష్టమని సినీనటుడు మంచు మనోజ్ పేర్కొన్నారు. మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన హేమావతి సిద్దేశ్వరస్వామి ఆలయాన్ని ఆయన తన భార్య భూమా మౌనికరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు(Madakasira MLA MS Raju), ఉమాదేవి దంపతులతో కలిసి శుక్రవారం సందర్శించారు. వారికి హేమావతి పంచాయతీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం మనోజ్ దంపతులు దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు. భైరవీశ్వరుడు, దొడ్డీశ్వరుడు దేవాల యాలను కూడా సందర్శించారు. దేవాలయ విశిష్టతను ఆలయ అర్చకులు వివరించారు. ఈఓ నరసింహరాజు, ఆలయ కమిటీ చైర్మన్ కరేగౌడ్, టీడీపీ నాయకులు కుమారస్వామి, రామచంద్రప్ప, జయకుమార్, తిప్పజ్జ, కృష్ణమూర్తి, ఓంకారస్వామి, శివకుమార్, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News