AP News: చిన్నారుల తిండిలో కక్కుర్తి..
ABN , Publish Date - Aug 19 , 2025 | 10:38 AM
పిల్లలకు పంపిణీ చేసే పౌష్టికాహారంలో ఐసీడీఎస్ అధికారులు, ఏజెన్సీ నిర్వాహకులు కక్కుర్తికి పాల్పడ్డారని తెలుస్తోంది. శింగనమల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో చిన్నారులకు పంపిణీ చేసే బాలామృతం బ్యాగులు 484 మాయమయ్యాయి. ప్రాజ్టెక్‌కు బ్యాగులు వచ్చినా వాటిని చిన్నారులకు పంపిణీ చేయకుండా స్వాహా చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
- 484 బాలామృతం బ్యాగులు మాయం
- ఆన్‌లైన్లో నమోదు చేయకపోవడంతో బయటపడ్డ వైనం
- లెక్కలు సరిచేయడానికి సిబ్బంది కుస్తీ
శింగనమల(అమరావతి): పిల్లలకు పంపిణీ చేసే పౌష్టికాహారంలో ఐసీడీఎస్ అధికారులు, ఏజెన్సీ నిర్వాహకులు కక్కుర్తికి పాల్పడ్డారని తెలుస్తోంది. శింగనమల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో చిన్నారులకు పంపిణీ చేసే బాలామృతం బ్యాగులు 484 మాయమయ్యాయి. ప్రాజ్టెక్‌కు బ్యాగులు వచ్చినా వాటిని చిన్నారులకు పంపిణీ చేయకుండా స్వాహా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది వచ్చిన స్టాక్ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో ఉన్నతాధికారులు గుర్తించి విచారణ చేపట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
గతంలో ఇక్కడ పనిచేసిన సిబ్బంది రెండు వారాలుగా ఆదివారం రోజు వచ్చి ఆన్‌లైన్‌లో సరిదిద్దడానికి కుస్తీ పడుతున్నట్లు సమాచారం. 2024 జనవరి నెలలో రావాల్సిన బాలామృతం 484 బ్యాగులు (ఒక్కో బ్యాగులో 8ప్యాకెట్ల చొప్పున 3872 ప్యాకెట్లు) మాయంపై విచారణ జరుగుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో 7 నెలలు నుంచి 3 సంవత్సరాలోపు చిన్నారులకు ప్రతినెలా 2.50 కిలోల పౌష్టికాహారం ప్యాకెట్ అందిస్తారు.

ఇక్కడ పనిచేసిన అధికారులు, బాలామృతం ఏజెన్సీ నిర్వాహకులు కుమ్మక్కై చిన్నారులకు పంపిణీ చేయకుండా స్వాహా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు సరాఫరా చేసినట్లు ఎఫ్‌టీఆర్ ఇచ్చారు. అప్పటి అధికారులు, ఏజెన్సీ కలిసి ఆన్‌లైన్‌లో తక్కువ నమోదు చేసినట్లు తెలుస్తోంది. రెండు నెలల కిందట దీనిపై లెక్క తేల్చాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో వ్యవహారం బయటకు వచ్చింది.
టెక్నికల్ సమస్యతో నమోదు చేయలేదు
గత సంవత్సరం జనవరి నెలలో బాలామృతం బ్యాగులలో 484 తక్కువ నమోదు చేశారు. ఆ నెలలో బుక్కరాయసముద్రం మండలంలోని రెండు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలామృతం బ్యాగులు చిన్నారులకు పంపిణీ చేసినట్లు రికార్డులు ఉన్నాయి. ఆ సమయంలో టెక్నికల్ సమస్యతో ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. బ్యాగులు మాయం అయినట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవం.
- లలితమ్మ, సీడీపీఓ, శింగనమల
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకుల మృతి
Read Latest Telangana News and National News