AP News: ఆడుదాం ఆంధ్రాకు.. రూ.119కోట్లు దారపోశారు
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:39 PM
వైసీపీ పాలనలో ఆడుదాం ఆంధ్రా పోటీలకు రూ.119 కోట్లు కేటాయించి, దుర్వినియోగం చేశారని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఆరోపించారు. నిధులు పూర్తిగా పక్కదారి పట్టినట్లు విచారణలో తేలిందని అన్నారు. అమరావతి చాంపియన్‌షిప్ రాష్ట్రస్థాయి పోటీలలో భాగంగా సోమవారం ఉదయం ఎస్వీక్యాంపస్ హైస్కూల్ మైదానంలో విలువిద్య పోటీలను ఆయన ప్రారంభించారు.
- 29న స్పోర్ట్స్ అకాడమీలపై ప్రకటన
- శాప్ చైర్మన్ రవినాయుడు
తిరుపతి: వైసీపీ పాలనలో ఆడుదాం ఆంధ్రా పోటీలకు రూ.119 కోట్లు కేటాయించి, దుర్వినియోగం చేశారని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఆరోపించారు. నిధులు పూర్తిగా పక్కదారి పట్టినట్లు విచారణలో తేలిందని అన్నారు. అమరావతి చాంపియన్‌షిప్ రాష్ట్రస్థాయి పోటీలలో భాగంగా సోమవారం ఉదయం ఎస్వీక్యాంపస్ హైస్కూల్ మైదానంలో విలువిద్య పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో క్రీడా అకాడమీలు రద్దు చేసిందని, వాటిని మళ్లీ ప్రారంభిస్తామని, క్రీడా పాఠశాలల సంఖ్య పెంచుతామని, ఇంటర్ వరకు మంచి శిక్షణ ఇవ్వడానికి కృషి చేస్తామని వివరించారు.
అమరావతి చాంపియన్‌షిప్‌లో పది క్రీడాంశాల్లో పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. కేవలం రూ.కోటిన్నర నిధులతో క్రీడాకారులకు నాణ్యమైన పరికరాలు, సదుపాయాలు కల్పించామన్నారు. ప్రతి జిల్లాలోనూ క్రీడాకారులను గుర్తించి జోనల్, రాష్ట్రస్థాయి వరకు తెచ్చామని, విజేతలకు సీఎం చంద్రబాబు చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేస్తామని అన్నారు. రాజకీయ ప్రమేయం లేకుండా జాగ్రత్తపడ్డామన్నారు. ఒలింపిక్స్‌లో ఆంధ్రా క్రీడాకారులు మెడల్స్ సాధించాలనే లక్ష్యంతో కార్యాచరణ చేశామని స్పష్టం చేశారు.
విజయవాడకు చెందిన విలువిద్య క్రీడాకారులు కె.ఝాన్సీలక్ష్మి, టి.భువనరాజేశ్వరి, కె.యుక్తశ్రీ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో ఆడే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉందన్నారు. ఇక్కడే గట్టిపోటీ ఎదుర్కొనే అవకాశం లభించిందని, తద్వారా జాతీయ స్థాయి పోటీలు సులభమవుతాయని పేర్కొన్నారు. సాయంత్రం టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి క్రీడా మైదానాలను సందర్శించారు. క్రీడాకారులతో ముచ్చటిస్తూ చక్కగా రాణించాలని ఆకాంక్షించారు. కాగా ఐదు వేదికల్లో పది క్రీడా పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. మంగళవారం అంతిమ ఫలితాలు రానున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..
Read Latest Telangana News and National News