జానీ మాస్టర్‌పై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు..
ABN, Publish Date - Sep 19 , 2024 | 01:54 PM
హైదరాబాద్: జానీ మాస్టర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దొంగలకు ఇచ్చే ట్రీట్‌మెంట్‌నే ఆయనకు ఇవ్వాలన్నారు. సినీ పరిశ్రమ నుంచి జానీ మాస్టర్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మతం మార్చుకోవాలని అమ్మాయిలను జానీ మాస్టర్ హింసించారని, మహిళల రక్షణ కోసం బలమైన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు.
హైదరాబాద్: జానీ మాస్టర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దొంగలకు ఇచ్చే ట్రీట్‌మెంట్‌నే ఆయనకు ఇవ్వాలన్నారు. సినీ పరిశ్రమ నుంచి జానీ మాస్టర్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మతం మార్చుకోవాలని అమ్మాయిలను జానీ మాస్టర్ హింసించారని, మహిళల రక్షణ కోసం బలమైన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు. జానీ మాస్టర్ కేసులో అసలు విషయాలు బయటపెట్టాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ ఒక్క యువతినే కాకుండా ఇంకా ఎంత మంది అమ్మాయిలను జానీ మాస్టర్ ఇబ్బంది పెట్టి.. ఎంత మంది యువతులను మతం మార్చుకోవాలని చెప్పారో ఆ విషయాలన్నీ బయటపెట్టాలని పోలీసు అధికారులను రాజా సింగ్ కోరారు.
కాగా టాలీవుడ్ డాన్స్ మాస్టర్ జానీ అలియాస్ షేక్ జానీ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసు టీమ్ గోవాలో ఆయన్ని అదుపులోకి తీసుకుంది. అక్కడి నుంచి జానీని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్‌ను హాజరుపరిచే అవకాశముందని తెలుస్తోంది. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ (21) ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్‌లొ ఇటీవల కేసు నమోదైంది. బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నార్సింగికి కేసును బదిలీ చేశారు. అతడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్న బాలినేని..
టీటీడీలో అవినీతిపై సీఎంకు ఫిర్యాదు..
టీడీపీ, వైసీపీవి నీచ రాజకీయాలు: వైఎస్ షర్మిల
‘ఇది మంచి ప్రభుత్వం’ బ్రోచర్ ఆవిష్కరణ
ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక ఆన్‌లైన్ బుకింగ్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Sep 19 , 2024 | 01:55 PM