ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు..
ABN, Publish Date - Sep 10 , 2024 | 01:46 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాలో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాలో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. గోదావరి జిల్లాలో మన్యం ప్రాంతాలు, ఉత్తరాంధ్రలో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఏలేరు కాలవకు చాలా చోట్ల గండి పడింది. దీంతో అనేక గ్రామాలు నీటి మునిగాయి. దాదాపు 10 మండలాల్లో ఈ వరద ప్రభావం ఉంది. కొల్లేరు ప్రాంతంలో వరద తీవ్రత తగ్గలేదు. కైకలూరు, ఏలూరు మార్గాలు పూర్తిగా స్తంభించాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రాత్రి సమయంలో ఆ మార్గాల్లో రాకపోకలను అధికారులు నిషేధించారు. విశాఖ నగరంలో కూడా కొన్ని చోట్ల కొండచరియలు విరిగి పడడంతో స్వల్ప నష్టం సంబవించింది. ఇంకా ఏజెన్సీలో గిరిజనులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గోదావరి ఉగ్రరూపం.. పెరుగుతున్న వరద..
వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన..
బుడమేరు సక్సెస్.. ఫలించిన కష్టం..
వారిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు?
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Sep 10 , 2024 | 01:46 PM