Share News

Yadadri Bhuvanagiri: సర్వేల్‌ గురుకుల ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌

ABN , Publish Date - Dec 20 , 2024 | 06:01 AM

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం సర్వేల్‌ గురుకుల పాఠశాలలో వేడి రాగి జావ మీద పడి ఇద్దరు విద్యార్థులకు గాయాలైన ఘటనలో ఆ గురుకులం ప్రిన్సిపాల్‌ వెంకటేశంపై సస్పెన్షన్‌ వేటు పడింది. విద్యార్థులకు అల్పాహారం అందించే విషయంలో ప్రిన్సిపాల్‌ నిర్లక్ష్యం, పర్యవేక్షణాలోపం ఉందని భావిస్తూ ఆయనను సస్పెండ్‌ చేస్తున్నట్లు కలెక్టర్‌ హనుమంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Yadadri Bhuvanagiri: సర్వేల్‌ గురుకుల ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌

  • వేడి రాగి జావ పడి ఇద్దరు విద్యార్థులు గాయపడిన ఘటనలో కలెక్టర్‌ చర్యలు

సంస్థాన్‌నారాయణపురం, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం సర్వేల్‌ గురుకుల పాఠశాలలో వేడి రాగి జావ మీద పడి ఇద్దరు విద్యార్థులకు గాయాలైన ఘటనలో ఆ గురుకులం ప్రిన్సిపాల్‌ వెంకటేశంపై సస్పెన్షన్‌ వేటు పడింది. విద్యార్థులకు అల్పాహారం అందించే విషయంలో ప్రిన్సిపాల్‌ నిర్లక్ష్యం, పర్యవేక్షణాలోపం ఉందని భావిస్తూ ఆయనను సస్పెండ్‌ చేస్తున్నట్లు కలెక్టర్‌ హనుమంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం నాటి ఘటనపై సీపీ ఎం, సీపీఐ, బీఆర్‌ఎస్‌, బీజేపీతోపాటు విద్యార్థి సంఘాలు ఎస్‌ఎ్‌ఫఐ, డీవైఎఫ్‌ ఐ, ఏఐవైఎఫ్‌, బీఆర్‌ఎ్‌సవీ గురువారం పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించాయి.


పాఠశాల లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం, తోపులాట జరిగి కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆందోళనకారులు పాఠశాల ప్రధాన ద్వారంఎదుట బైఠాయించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థికి, వంట మనిషికి రూ.50లక్షల నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ ఈ ఘటనపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ను విచారణాధికారిగా నియమించారని, బాధ్యులపై చర్యలు తీసుకుంటారని ఆర్డీవో హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు.

Updated Date - Dec 20 , 2024 | 06:01 AM