Share News

Kaleshwaram: మేడిగడ్డలో షీట్‌ఫైల్స్‌ పనులు షురూ

ABN , Publish Date - May 27 , 2024 | 03:58 AM

మేడిగడ్డ బ్యారేజీలో కుంగుబాటుకు గురైన బ్లాక్‌-7కు దిగువన షీట్‌ఫైల్స్‌ ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం బ్లాక్‌-7కు దిగువన ఉన్న ఒక వరుస సీసీ బ్లాక్‌లను తొలగించడంతో పాటు వరద ఉధృతికి చెల్లాచెదురైన సీసీ బ్లాక్‌లను తిరిగి అమరుస్తున్నారు.

Kaleshwaram: మేడిగడ్డలో షీట్‌ఫైల్స్‌ పనులు షురూ

  • బ్లాక్‌-7కు దిగువన సీసీ బ్లాక్‌ల తొలగింపు

  • కొనసాగుతున్న గేట్ల తొలగింపు పనులు

మహదేవపూర్‌ రూరల్‌, మే 26: మేడిగడ్డ బ్యారేజీలో కుంగుబాటుకు గురైన బ్లాక్‌-7కు దిగువన షీట్‌ఫైల్స్‌ ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం బ్లాక్‌-7కు దిగువన ఉన్న ఒక వరుస సీసీ బ్లాక్‌లను తొలగించడంతో పాటు వరద ఉధృతికి చెల్లాచెదురైన సీసీ బ్లాక్‌లను తిరిగి అమరుస్తున్నారు. వానాకాలం వరదలు తగ్గేంత వరకు గేట్లు తెరిచే ఉంచనుండటంతో బ్యారేజీ కింద ఉన్న బుంగల ద్వారా ఇసుక జారకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పిల్లర్ల కింద ఉన్న అగాధాన్ని పూడ్చేయనున్నప్పటికీ కొత్తగా బుంగలు ఏర్పడితే పిల్లర్ల కింద ఉన్న ఇసుక జారకుండా షీట్‌ఫైల్‌ ఉపయోగపడనున్నట్లు ఓ అధికారి వివరించారు.


దీంతోపాటు బ్లాక్‌-7లో ఉన్న 11గేట్లల్లో ఇప్పటికే 4గేట్లను ఎత్తిన అధికారులు 20, 21పిల్లర్ల మధ్యనున్న గేటును తొలగించే పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు... బ్లాక్‌-7 కింద ఏర్పడిన అగాధాన్ని పూడ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా బ్లాక్‌-7లోని 19,20,21 పిల్లర్ల కింద ఉన్న బుంగలను ఇసుక, సిమెంట్‌ గ్రౌటింగ్‌ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఇసుక, సిమెంట్‌తో పాటు కావాల్సిన యంత్రాలు, సామగ్రిని ఏర్పాటు చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో పిల్లర్ల కింద గ్రౌటింగ్‌ పనులను ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఓ అధికారి చెప్పారు.

Updated Date - May 27 , 2024 | 03:58 AM