Share News

Vinay Bhaskar: తెలంగాణ చరిత్రను రూపుమాపేందుకు రేవంత్ కుట్ర...

ABN , Publish Date - Feb 12 , 2024 | 12:03 PM

Telangana: తెలంగాణ ప్రభుత్వ చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం అని.. చార్మినార్‌ను తొలగిస్తారని తెలిసి ప్రజలు ఆవేదన చెందుతున్నారని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు.

Vinay Bhaskar: తెలంగాణ చరిత్రను రూపుమాపేందుకు రేవంత్ కుట్ర...

హనుమకొండ, ఫిబ్రవరి 12: తెలంగాణ ప్రభుత్వ చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం అని.. చార్మినార్‌ను తొలగిస్తారని తెలిసి ప్రజలు ఆవేదన చెందుతున్నారని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ (Former MLA Vinay Bhaskar) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని... లేకపోతే ఓరుగల్లు నుంచే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాకతీయ కళా తోరణంకు పెద్ద చరిత్ర ఉందన్నారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలంగాణ చరిత్రను రూపు మాపే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రా నాయకుల ఆదేశం మేరకే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. హామీలు అమలు చేయలేదని ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ప్రకటన అని వ్యాఖ్యలు చేశారు. చార్మినార్ తొలగింపు అంటే ముస్లిం ల మనోభావాలు దెబ్బ తిన్నట్లే అని అన్నారు. జిల్లా మంత్రులు సీతక్క, సురేఖకు ఓరుగల్లు పౌరుషం లేదు అంటూ వినయ్ భాస్కర్ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 12 , 2024 | 12:03 PM