Share News

Telangana: ఆ 106 ఎకరాలు అటవీ శాఖవే

ABN , Publish Date - Apr 19 , 2024 | 09:01 AM

దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న భూవివాదానికి సుప్రీంకోర్టు(Supreme Court Of India) ముగింపు పలికింది. భూపాలపల్లి(Bhupalpally) జిల్లా కేంద్రంలోని కొంపల్లి గ్రామ శివారులో సర్వే నంబర్‌ 171లో ఉన్న 106.34 ఎకరాల భూమి రాష్ట్ర అటవీశాఖకే చెందుతుందని తీర్పు చెప్పింది.

Telangana: ఆ 106 ఎకరాలు అటవీ శాఖవే
Supreme Court of India

  • భూపాలపల్లి జిల్లా కొంపల్లి భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు

  • 39 ఏళ్లుగా కొనసాగుతున్న కేసుకు ముగింపు

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న భూవివాదానికి సుప్రీంకోర్టు(Supreme Court Of India) ముగింపు పలికింది. భూపాలపల్లి(Bhupalpally) జిల్లా కేంద్రంలోని కొంపల్లి గ్రామ శివారులో సర్వే నంబర్‌ 171లో ఉన్న 106.34 ఎకరాల భూమి రాష్ట్ర అటవీశాఖకే చెందుతుందని తీర్పు చెప్పింది. సదరు భూమి తనదేనని 1985లో వరంగల్‌ జిల్లా కోర్టులో మహ్మద్‌ అబ్దుల్‌ ఖాసిం పిటిషన్‌ దాఖలు చేశారు. 1994లో జిల్లా కోర్టు దానిని కొట్టివేసింది. అదే ఏడాది ఖాసిం హైకోర్టును ఆశ్రయించారు. 2018లో హైకోర్టు కూడా ఆ భూమి అటవీ శాఖ దేనని తీర్పు వెలువరించింది. హైకోర్టులో ఖాసిం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. 2021 మార్చిలో హైకోర్టు తీర్పు ఇస్తూ.. భూమి ఖాసింకే చెందుతుందని పేర్కొంది. దీనిని అటవీశాఖ మే 2021లో సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌, జస్టిస్‌ ఎస్‌ వీఎన్‌ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. గురువారం జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌ తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇవికూడా చదవండి:

టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా..

బస్సు లోపల్నుంచే జగన్ షో!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2024 | 09:01 AM