Banjara Hills: డ్రగ్స్‌కు బానిసై మెడ, చెయ్యి కోసుకొని..
ABN , Publish Date - Jun 07 , 2024 | 03:33 AM
మాదక ద్రవ్యాలు ఓ మనిషి మానసిక ఆరోగ్యాన్ని, జీవితాన్ని ఎంత నాశనం చేస్తాయో చెప్పే ఘటన ఒకటి వెలుగు చూసింది. డ్రగ్స్‌కు బానిసైన ఓ మైనర్ బాలుడు.. తాను ఏం చేస్తున్నానో గ్రహించలేని స్థితిలో తన శరీరాన్ని తీవ్రంగా గాయపరుచుకున్నాడు.

రోడ్డుపై రక్తాన్ని చిందిస్తూ హైదరాబాద్‌లో బాలుడి వికృతానందం
సోషల్ మీడియాలో వీడియో పోస్ట్
నెటిజన్ల షాక్.. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వానికి సూచన
డ్రగ్స్‌కు బానిసై మైనర్ పైశాచికత్వం
కత్తితో మెడ, చెయ్యి మీద కోసుకున్నాడు
ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన వైనం
బంజారాహిల్స్, జూన్ 6(ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాలు ఓ మనిషి మానసిక ఆరోగ్యాన్ని, జీవితాన్ని ఎంత నాశనం చేస్తాయో చెప్పే ఘటన ఒకటి వెలుగు చూసింది. డ్రగ్స్‌కు బానిసైన ఓ మైనర్ బాలుడు.. తాను ఏం చేస్తున్నానో గ్రహించలేని స్థితిలో తన శరీరాన్ని తీవ్రంగా గాయపరుచుకున్నాడు. రక్తం చిందేలా కత్తితో తన మెడ మీద తానే కోసుకున్నాడు. ఆపై, చేతి మీద బలంగా కోసుకుని రక్తాన్ని రహదారిపై చిందిస్తూ వికృతానందం పొందాడు. మరో వ్యక్తి ఈ వికృతాన్ని వీడియో తీయగా దానిని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చెయ్యమని ఆ బాలుడు చెప్పడం మరింత శోచనీయం.
హైదరాబాద్, బోరబండ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. బోరబండ ప్రాంతానికి చెందిన ఓ బాలుడు(16) కత్తితో తన మెడను కోసుకుని వీధుల్లో పది నిమిషాల పాటు తిరిగాడు. అనంతరం మూసి ఉన్న ఓ దుకాణం వద్ద కూర్చొని చెయ్యిని కోసుకుని రక్తాన్ని బయట విరజిమ్మాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు ఇదేం శాడిజం అనుకుంటూ నివ్వెరపోయారు. డ్రగ్స్‌కు బానిసై తన కుమారుడు ఇలా ప్రవర్తిస్తున్నాడని సదరు బాలుడి తల్లి సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు.. యువత జీవితాలను నాశనం చేస్తోన్న డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.