TTD: తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు ఆమోదం!
ABN , Publish Date - Dec 28 , 2024 | 05:19 AM
ఏపీలోని తిరుమలలో భక్తులకు దర్శనం, వసతి కల్పించే విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న డిమాండ్‌కు టీటీడీ బోర్డు ఎట్టకేలకు ఆమోదం తెలిపింది.

వారంలో రెండుసార్లు అనుమతి టీటీడీ బోర్డు నిర్ణయం
జడ్చర్ల, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఏపీలోని తిరుమలలో భక్తులకు దర్శనం, వసతి కల్పించే విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న డిమాండ్‌కు టీటీడీ బోర్డు ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. వారంలో రెండుసార్లు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని శుక్రవారం నిర్ణయం తీసుకుంది. దీనిపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్నేళ్లుగా తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోకపోవడంపై.. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్ గళం విప్పిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం ఏపీ సీఎం చంద్రబాబుతో ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే టీటీడీ బోర్డు సానుకూల నిర్ణయం తీసుకుంది.