Share News

TSPSC Chairman Mahender Reddy: నా ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారు..

ABN , Publish Date - Feb 06 , 2024 | 09:51 PM

తన ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశంతో కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీఎస్‌పీఎస్సీ చైర్మన్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. అవినీతి ఆరోపణలపై మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు.

TSPSC Chairman Mahender Reddy: నా ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారు..

హైదరాబాద్: తన ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశంతో కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీఎస్‌పీఎస్సీ చైర్మన్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. అవినీతి ఆరోపణలపై మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను 36 ఏళ్లకు పైగా ఎలాంటి కళంకం లేకుండా పని చేశానని గుర్తు చేశారు. ఉద్యోగ విరమణ వరకు 36 సంవత్సరాలకు పైగా అంకిత భావంతో పనిచేశానన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రంలో పోలీసు శాఖలో సుధీర్ఘ కాలం పనిచేశానని, కెరీర్ మొత్తంలో తనకు క్లీన్ రికార్డ్ ఉందన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరమని చెప్పారు. తనపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవి తేల్చి చెప్పారు. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటూ పరువునష్టం దాఖలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Tirupati: మలుపు తిరిగిన ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కేసు

Updated Date - Feb 06 , 2024 | 09:51 PM