Caste Construction: జాతి నిర్మాణంలో ఖనిజ సంపద కీలకం
ABN , Publish Date - Jul 15 , 2024 | 03:27 AM
భవన నిర్మాణ రంగం జాతి నిర్మాణంలో ఒక భాగమని తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు.
ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): భవన నిర్మాణ రంగం జాతి నిర్మాణంలో ఒక భాగమని తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. భవన నిర్మాణాలకు అవసరమైన నాణ్యమైన ఇసుకను సరఫరా చేయడం ద్వారా ఖనిజాభివృద్ధి సంస్థ కూడా జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా పని చేస్తామని తెలిపారు.
ఖనిజ సంపద ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళికాబద్ధంగా పని చేస్తామని చెప్పారు. ఇటీవల ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమితులైన అనిల్‌ను అభినందించడానికి పలువురు కార్యకర్తలు, అభిమానులు ఖైరతాబాద్‌లోని ఆయన కార్యాలయానికి వస్తున్నారు. అనిల్ గతంలో ప్రవాస భారతీయుడిగా ఉండటంతో పలువురు శ్రేయోభిలాషులు ఆయనను కలిసేందుకు విదేశాల నుంచి కూడా వస్తున్నారు.