Share News

TS News: వరంగల్‌లో మొదటి ఫలితం ఇక్కడి నుంచే..

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:18 PM

ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరంగల్ లోకసభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.

TS News: వరంగల్‌లో మొదటి ఫలితం ఇక్కడి నుంచే..

వరంగల్: ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరంగల్ లోకసభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. వరంగల్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు వారీగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 17 రౌండ్లు ఉండడంతో లెక్కింపు మొదట పూర్తి కానున్నది.

అతిపెద్ద పార్టీగా అవతరించనున్న టీడీపీ..


వరంగల్‌లో మొదటి ఫలితం కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచే రానుంది. తొలిత పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్, సర్వీస్ ఓట్లను గోదాం సంఖ్య 18 లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 14 టేబుల్ పై అధికారులు లెక్కించనున్నారు. ఏడు సెగ్మెంట్లకు గాను మొత్తం 124 టేబుల్స్ పై 127 రౌండ్స్ లెక్కించనున్నారు. వరంగల్ బరిలో 42 మంది అభ్యర్థులు ఉండగా మొత్తం పోలింగ్ శాతం 68.86 గా నమోదైంది. మొత్తం ఓటర్ల సంఖ్య 18, 24,466 గానూ 12,56,31 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పోస్టల్ బ్యాలెట్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ

బానిసత్వాన్ని తెలంగాణ భరించదు:సీఎం

మరో బాదుడు మొదలుపెట్టిన జగన్..

Read Latest Telangana News and National News

Updated Date - Jun 03 , 2024 | 12:18 PM