Share News

Telangana Budget: తెలంగాణ మెత్తం బడ్జెట్ రూ.2,75,891కోట్లు.. ఏ శాఖకు ఎన్ని నిధులంటే..

ABN , Publish Date - Feb 10 , 2024 | 12:43 PM

2024-25 సంవత్సరానికిగాను తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. మెత్తం బడ్జెట్ రూ.2,75,891కోట్లుగా తెలిపారు.

Telangana Budget: తెలంగాణ మెత్తం బడ్జెట్ రూ.2,75,891కోట్లు.. ఏ శాఖకు ఎన్ని నిధులంటే..

హైదరాబాద్: 2024-25 సంవత్సరానికిగాను తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. మెత్తం బడ్జెట్ రూ.2,75,891కోట్లుగా తెలిపారు. అందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా పేర్కొన్నారు. మొత్తం బడ్జెట్‌లో శాఖల వారిగా నిధుల కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి.

ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం రూ.53,196 కోట్లు

పరిశ్రమల శాఖకు రూ. 2543 కోట్లు

ఐటీ శాఖకు రూ.774 కోట్లు.

పంచాయతీ రాజ్ శాఖకు రూ.40,080 కోట్లు

పురపాలక శాఖకు రూ.11692 కోట్లు

మూసీ రివర్ ఫ్రాంట్‌కు వెయ్యి కోట్లు

వ్యవసాయ శాఖకు రూ.19746 కోట్లు

ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250 కోట్లు

ఎస్సీ సంక్షేమానికి రూ.21874 కోట్లు

ఎస్టీ సంక్షేమానికి రూ.13013 కోట్లు

మైనార్టీ సంక్షేమానికి రూ.2262 కోట్లు

బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు.

బీసీ సంక్షేమానికి రూ.8 వేల కోట్లు

విద్యా రంగానికి రూ.21389 కోట్లు.

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కోట్లు.

యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు

వైద్య రంగానికి రూ.11500 కోట్లు

విద్యుత్ - గృహ జ్యోతికి రూ.2418కోట్లు.

విద్యుత్ సంస్థలకు రూ.16825 కోట్లు.

గృహ నిర్మాణానికి రూ.7740 కోట్లు.

నీటి పారుదల శాఖకు రూ.28024 కోట్లు కేటాయించారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 10 , 2024 | 12:49 PM