TG Government: 317 జీవో కింద 52,235 దరఖాస్తులు..
ABN , Publish Date - Jul 13 , 2024 | 03:15 AM
ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసిన నేపథ్యంలో 317 జీవో కింద వచ్చిన దరఖాస్తులను స్ర్కూట్నీ(పరిశీలన) చేయాలని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
స్క్రూట్నీ చేసి.. 16వరకు నివేదిక ఇవ్వండి
శాఖల ముఖ్య కార్యదర్శులకు ప్రభుత్వ నిర్దేశం
హైదరాబాద్, జూలై 12(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసిన నేపథ్యంలో 317 జీవో కింద వచ్చిన దరఖాస్తులను స్ర్కూట్నీ(పరిశీలన) చేయాలని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్రూట్నీ అనంతరం ఆ నివేదికను జూలై 16 వరకు తమకు అందించాలని పేర్కొంది. కాగా 317 జీవో కింద స్పౌజ్(భాగస్వామి), మ్యూచువల్, మెడికల్, లోకల్ ఇతర విభాగాల పరిఽధిలో మొత్తం 52,235 దరఖాస్తులు వచ్చాయి. శాఖల కార్యదర్శులు వాటిని పరిశీలించి 16వ తేదీ వరకు నివేదిక అందించనున్నారు.