Share News

CM Revanth Reddy: ఇవాళ తెలంగాణ మంత్రి వర్గ సమావేశం.. అత్యవసర అంశాలపై చర్చ..

ABN , Publish Date - May 20 , 2024 | 10:55 AM

ఇవాళ మధ్యాన్నం మూడు గంటలకు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈసీ నిబంధనలకు లోబడి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినేట్ భేటీ కానుంది. అత్యవసర అంశాలు మాత్రమే కేబీనెట్‌లో చర్చకు రానున్నాయి. ఉమ్మడి రాజధాని, రుణమాఫీలపై ఎలక్షన్ కమిషన్ చర్చ చేయొద్దని తెలిపింది. జూన్ 4లోపు చర్చించాల్సిన అంశాలే ఎజెండాగా కేబినెట్ సమావేశం జరుగనుంది.

CM Revanth Reddy: ఇవాళ తెలంగాణ మంత్రి వర్గ సమావేశం.. అత్యవసర అంశాలపై చర్చ..

హైదరాబాద్: ఇవాళ మధ్యాన్నం మూడు గంటలకు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈసీ నిబంధనలకు లోబడి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినేట్ భేటీ కానుంది. అత్యవసర అంశాలు మాత్రమే కేబీనెట్‌లో చర్చకు రానున్నాయి. ఉమ్మడి రాజధాని, రుణమాఫీలపై ఎలక్షన్ కమిషన్ చర్చ చేయొద్దని తెలిపింది. జూన్ 4లోపు చర్చించాల్సిన అంశాలే ఎజెండాగా కేబినెట్ సమావేశం జరుగనుంది. వడ్ల కొనుగోలు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రానున్న విద్య సంవత్సరానికి సంబంధించిన అంశాలపై ముఖ్యంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది.

Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. బతికున్న ఆనవాళ్లు లేవన్న రిపోర్ట్స్


పుస్తకాల పంపిణీ, స్కూల్ యూనిఫామ్‌ల డిష్టిబ్యూషన్, విద్య సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనలపై సమీక్ష జరగనుంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే అంశంపై చర్చించనున్నారు. ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలు చర్చకు మాత్రమే రానున్నాయి. అలాగే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్‌లపై ఇరిగేషన్ అధికారులతో రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి...

AP Poll Violence: ఏపీలో అల్లర్లపై సిద్ధమైన సిట్ ప్రాథమిక నివేదిక

Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ మృతి.. ధృవీకరించిన స్థానిక మీడియా

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 20 , 2024 | 10:55 AM