Congress: అసెంబ్లీలో 65కు చేరిన కాంగ్రెస్ బలం..
ABN , Publish Date - Jun 05 , 2024 | 06:09 AM
కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయంతో అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 65కు పెరిగింది. ఇప్పటిదాకా ఆ పార్టీకి అసెంబ్లీలో 64 మంది సభ్యుల బలం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు కాంగ్రె్‌సలో చేరిపోయారు.
బీఆర్‌ఎస్ నుంచి చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు,
సీపీఐ ఎమ్మెల్యేతో కలిపితే మొత్తంగా 69కి చేరిక
హైదరాబాద్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయంతో అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 65కు పెరిగింది. ఇప్పటిదాకా ఆ పార్టీకి అసెంబ్లీలో 64 మంది సభ్యుల బలం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు కాంగ్రె్‌సలో చేరిపోయారు. తొలి నుంచి కాంగ్రె్‌సకు మద్దతు ఇస్తున్న సీపీఐకి ఓ ఎమ్మెల్యే ఉన్నారు. మొత్తంగా అసెంబ్లీలో కాంగ్రె్‌సకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 69కి చేరింది. ఇక, కంటోన్మెంట్‌లో ఓటమితో అసెంబ్లీలో బీఆర్‌ఎస్ సభ్యుల సంఖ్య సాకేంతికంగా 38కు పడిపోయింది. ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరిన ముగ్గురినీ లెక్కేస్తే ఆ సంఖ్య 35కు తగ్గుతుంది. భవిష్యత్‌లో మరికొందరు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లేదా బీజేపీ గూటికి చేరుతారని తెలుస్తోంది.