Share News

Medaram Jatara 2024: పగిడిద్దరాజు గుడిలో ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Feb 20 , 2024 | 10:10 AM

Telangana: జిల్లాలోని గంగారం మండలం పూనుగొండ్లలో పగిడిద్దరాజు గుడిలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు మధ్యాహ్నం పగిడిద్దరాజు మేడారం బయలుదేరనున్నారు. పగిడిద్దరాజును తీసుకుని కోయ పూజారులు అటవీ మార్గంలో కాలినడకన మేడారంకు బయలుదేరి వెళ్లనున్నారు.

Medaram Jatara 2024: పగిడిద్దరాజు గుడిలో ప్రత్యేక పూజలు
Medaram Jatara

మహబూబాబాద్, ఫిబ్రవరి 20: జిల్లాలోని గంగారం మండలం పూనుగొండ్లలో పగిడిద్దరాజు గుడిలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు మధ్యాహ్నం పగిడిద్దరాజు మేడారం బయలుదేరనున్నారు. పగిడిద్దరాజును తీసుకుని కోయ పూజారులు అటవీ మార్గంలో కాలినడకన మేడారంకు బయలుదేరి వెళ్లనున్నారు. నేటి రాత్రికి పగిడిద్దరాజు మేడారం‌కు రానున్నారు.

జాతర ఇలా...

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క - సారలమ్మ మేడారం జాతర (Medaram Jatara 2024) ఈనెల 21 నుంచి నాలుగు రోజుల పాటు ఘనంగా జరుగనుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి జరుగుతుంది. 2024 ఫిబ్రవరి 21న జాతర మొదలుకానుంది. జాతరకు ఒకరోజు ముందే పగిడిద్దరాజును మేడారంకు తీసుకువస్తారు. అనంతరం సారలమ్మ, గోవిందరాజును గద్దెకు తీసుకువస్తారు. ఫిబ్రవరి 22న సమ్మక్క దేవతను గద్దెకు తీసుకువస్తారు. ఫిబ్రవరి 23న భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఫిబ్రవరి 24న దేవతల వనప్రవేశం ఉండగా... ఫిబ్రవరి 28వ జాతర పూజలు ముగింపు కార్యక్రమాలు ఉంటాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 20 , 2024 | 02:27 PM