Share News

CM Revanth Reddy: పదో తరగతి పరీక్షలపై రేవంత్ సీరియస్.. జామర్లతో సిగ్నల్స్ ఆఫ్ చేయిస్తారట..

ABN , Publish Date - Mar 12 , 2024 | 01:06 PM

పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్‌గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈసారి కఠిన ఆంక్షలతో పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర నో సెల్ ఫోన్ జోన్స్‌ను ఏర్పాటు చేశారు. పరీక్ష జరిగేంత వరకూ అవసరమైతే జామర్లతో సిగ్నల్స్ ఆఫ్ చేయించే యోచనలో అధికారులు ఉన్నారు.

CM Revanth Reddy: పదో తరగతి పరీక్షలపై రేవంత్ సీరియస్.. జామర్లతో సిగ్నల్స్ ఆఫ్ చేయిస్తారట..

హైదరాబాద్: పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చాలా సీరియస్‌గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈసారి కఠిన ఆంక్షలతో పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ (Examination Centres) దగ్గర నో సెల్ ఫోన్ జోన్స్‌ (CellPhone Zones)ను ఏర్పాటు చేశారు. పరీక్ష జరిగేంత వరకూ అవసరమైతే జామర్లతో సిగ్నల్స్ ఆఫ్ చేయించే యోచనలో అధికారులు ఉన్నారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, స్క్వాడ్, సిబ్బందికి ఫోన్లను అందుబాటులో లేకుండా చూడనున్నారు. రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Hyderabad: నేడు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచన

పరీక్ష కేంద్రం నుంచి ప్రశ్న పత్రాలు బయటికి వెళ్లకుండా, మాస్ కాపీయింగ్ జరుగకుండా కట్టుదిట్టంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఏడాది జరిగిన ఘటనల నేపధ్యంలో ఈ సారి పక్కాగా పరీక్షలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 18 నుంచి ఎప్రిల్ 2 వరకు పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. 5.80 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు.

Warangal: 16న పెళ్లి... అంతలోనే విషాదం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 12 , 2024 | 01:06 PM