TS NEWS: ఆ విషయంలో కేసీఆర్ ఎందుకు సైలెంట్ అయ్యారు: వంశీచంద్ రెడ్డి
ABN , Publish Date - Mar 01 , 2024 | 09:26 PM
ఏపీ మంత్రి రోజా పెట్టిన చేపల పులుసు, రాగి సంగటి తిని అపెక్స్ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) వెళ్లలేదని ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి(Vamsichand Reddy) అన్నారు. శుక్రవారం నాడు ఛలో పాలమూరు రంగారెడ్డికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సభలో వంశీచంద్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రంగారెడ్డి: ఏపీ మంత్రి రోజా పెట్టిన చేపల పులుసు, రాగి సంగటి తిని అపెక్స్ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) వెళ్లలేదని ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి(Vamsichand Reddy) అన్నారు. శుక్రవారం నాడు ఛలో పాలమూరు రంగారెడ్డికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సభలో వంశీచంద్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా తానా అంటే కేసీఆర్ తందానా అన్నారని చెప్పారు. రోజా పెట్టిన రాగి సంగటికి కేసీఆర్ కృష్ణా జలాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఆంధ్ర దొంగలు నీటి జలాలు తరలుంచుకు వెళ్తుంటే కేసీఆర్ సైలెంట్‌గా ఉన్నారని మండిపడ్డారు. మేడిగడ్డ దగ్గర రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని కోరారు. బీఆర్ఎస్ నేతల కమీషన్లకు కాళేశ్వరం బలైందని చెప్పారు.
వాస్తవాలు కాంగ్రెస్ చెబుతోందని, అవాస్తవాలు మాత్రం బీఆర్ఎస్ చూపిస్తోందన్నారు. బీఆర్ఎస్ నేతల నిజస్వరూపం బయట పెట్టడానికే పాలమూరు పర్యటన చేశామని తేల్చిచెప్పారు. నల్లగొండలో కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి లెక్కలు తెలుసుకుని మాట్లాడాలని... పాలమూరుకు ఖర్చుచేయాల్సిన నిధులను గత కేసీఆర్ నొక్కేసిందని ఆరోపించారు.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేడిగడ్డ కృంగితే ఆ నష్టానికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. మాజీమంత్రి కేటీఆర్ బాధ్యతా రహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం నష్టానికి కారణం అయిన కేసీఆర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం డిజైన్ చేసానని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు. కృష్ణా నదిలో తెలంగాణ వాటా సాధించడంలో గత ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తాత్కాలికంగా కేటాయించిన నీటిని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోయిందని తెలిపారు. దమ్ముంటే కేసీఆర్ మహాబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయాలని వంశీచంద్ రెడ్డి సవాల్ విసిరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి....