Share News

TS NEWS: మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఉద్రిక్తత.. కారణమిదే..?

ABN , Publish Date - Mar 04 , 2024 | 10:46 PM

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌(Mallareddy Engineering College)లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గండి మైసమ్మలోని MREC క్యాంపస్‌లో విద్యార్థులు సోమవారం నాడు ఆందోళనకు దిగారు. అన్నంలో పెట్టే స్వీట్‌లో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు.

TS NEWS: మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఉద్రిక్తత.. కారణమిదే..?

మేడ్చల్: మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌(Mallareddy Engineering College)లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గండి మైసమ్మలోని MREC క్యాంపస్‌లో విద్యార్థులు సోమవారం నాడు ఆందోళనకు దిగారు. అన్నంలో పెట్టే స్వీట్‌లో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇటీవల కూడా మల్లారెడ్డి కాలేజ్‌లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు, విద్యార్థి సంఘాల ధర్నా చేశాయి. గతంలో పురుగులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటామని కాలేజీ చైర్మన్ మల్లారెడ్డి హామీ ఇచ్చారు.

ఆయన హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. మళ్లీ నేడు(సోమవారం) రాత్రి భోజనం, స్వీట్‌లో పురుగులు రావడంతో క్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీడియోలు తీస్తున్న విద్యార్థినులకు వార్డెన్ వార్నింగ్ ఇచ్చారు. వీడియో డిలీట్ చేయకపోతే చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డారు. చైర్మన్ మల్లారెడ్డి వచ్చే వరకు తమ ఆందోళనను విరమించమని విద్యార్థులు తేల్చిచెప్పారు. దీంతో కాలేజీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Updated Date - Mar 04 , 2024 | 10:46 PM