Share News

Rangareddy Dist.: మొయినాబాద్ యువతి హత్య కేసులో కొనసాగుతున్న మిస్టరీ..

ABN , Publish Date - Jan 09 , 2024 | 09:13 AM

రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్ యువతి హత్య కేసులో మిస్టరీ కొనసాగుతోంది. సోమవారం పట్టపగలే యువతిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మంటల్లో కాలుతున్న యువతి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Rangareddy Dist.: మొయినాబాద్ యువతి హత్య కేసులో కొనసాగుతున్న మిస్టరీ..

రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్ యువతి హత్య కేసులో మిస్టరీ కొనసాగుతోంది. సోమవారం పట్టపగలే యువతిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మంటల్లో కాలుతున్న యువతి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పరిసరాలను పరిశీలించారు. హత్యకు సంబంధించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు. ఘటన స్థలంలో సగం కాలిపోయి దొరికిన సెల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుతం 80 శాతం కాలిన యువతి మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా మార్చరీలో ఉంచారు. కంసైడ్ పరిధిలో మిస్సింగ్ కేసులకు సంబంధించి వివరాలు తెలుసుకుంటున్నారు.

కాగా గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువతిని హత్యచేసి తగులబెట్టారు. ఈ ఘటన మండల పరిధిలోని బాకారం పరిసరాల్లో చోటుచేసుకుంది. సుమారు 20 నుంచి 25 సంవత్సరాల గుర్తుతెలియని యువతిని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్‌ మండలంలోని బాకారం సమీపంలో సోమవారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన రైతులు కొంతమంది రోడ్డుపక్కన కాలుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చిన సమయానికి కూడా యువతి మృతదేహం కాలుతూనే ఉంది. రైతుల సహాయంతో నీళ్లుపోసి మంటలు ఆర్పారు.

కాగా, గుర్తుతెలియని వ్యక్తులు యువతిని వేరేచోట హత్యచేసి ఇక్కడికు తీసుకొచ్చి పెట్రోల్‌ పోసి తగులబెట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం పక్కన సగం కాలిన సెల్‌ఫోన్‌ లభ్యమైంది. శరీరం 80 శాతం కాలినట్లు తెలిపారు. సంఘటనా స్థలాన్ని చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి సందర్శించారు. క్లూస్‌టీం సహాయంతో వివరాలు సేకరిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. మూడు టీంలతో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. రాజేంద్రనగర్‌ జోన్‌ అదనపు డీసీపీ రష్మీపెరుమాల్‌ పర్యవేక్షిస్తున్నారు. కాగా, మృతదేహం గుర్తుపట్టలేనంతగా కాలిపోయిందని, యువతి ఎవరనేది తెలుసుకోవడంతోపాటు నిందితులను సైతం పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు. ఈమేరకు మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 09 , 2024 | 09:13 AM