Share News

కేసీఆర్ కోసం పురాణపండ శ్రీనివాస్‌తో త్వరలో పొన్నాల నృసింహ తేజస్సు

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:53 AM

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, తానున్న బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, గత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దంపతుల చిత్రాలతో ఒక విలువైన గ్రంధాన్ని శ్రీవైష్ణవ క్షేత్రాలకు, నృసింహ క్షేత్రాలకు, ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణులకు, ప్రధాన నాయికా నాయకులకు అందించాలనే తపనతో ఒక నృసింహ తేజస్సును గ్రంథ రూపంలో ప్రచురించి బహూకరించాలని సంకల్పించినట్లు బీఆర్‌ఎస్ శ్రేణుల్లో సమాచారం నడుస్తోంది.

కేసీఆర్ కోసం పురాణపండ శ్రీనివాస్‌తో త్వరలో పొన్నాల నృసింహ తేజస్సు

హైదరాబాద్, ఏప్రిల్ 24: అహోబిలం, యాదాద్రి, వేదాద్రి, అంతర్వేది, సింహాచలం, కోరుకొండ ... ఇలా ఎన్నో నృసింహ క్షేత్రాలలో వేద పండితుల ఆశీర్వచన భాగ్యం పొందిన గతకాలపు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మినిస్టర్, ఇప్పటి తెలంగాణ బీఆర్‌ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య యాదాద్రి లక్ష్మీ నృసింహుని కటాక్షంతో ప్రచురించిన ‘ఓం నమో నారసింహాయ’ గ్రంధం శ్రీవైష్ణవ విలువలతో ప్రకాశించడంవల్లనే ఇప్పటికీ కొన్ని శ్రీవైష్ణవ వేద పాఠశాలల విద్యార్థులు తమ కోర్సులో కొంతభాగాన్ని ఈ గ్రంధంలోంచే నేర్చుకోవడం గమనార్హం.

Puranapanda.jpg

పదేళ్ల వెనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పొన్నాల లక్ష్మయ్య రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్‌తో ప్రత్యేక చర్చలు జరిపి అపూర్వంగా ప్రచురించిన దివ్య గ్రంధాలలో శ్రీ లక్ష్మీ నృసింహ భగవానుని ‘ఓం నమో నారసింహాయ’ గ్రంధం ఎంతోమంది కాంగ్రెస్ వర్గాలకు చేరడమే కాకుండా పండితవర్గాలలో సంచలనం సృష్టించి ఆకర్షించింది. ఆనాటి కొందరు న్యాయ మూర్తులకు సైతం, న్యాయవాదులకు, పుణ్యక్షేత్రాలకు పొన్నాల తమ అనుచరగణంతో ఈ ఉత్తమ గ్రంధాన్ని బహూకరించడంతో పొన్నాలపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

Ponnala-1.jpg

అందులోనూ ... పురాణపండ శ్రీనివాస్ పవిత్ర ప్రయాణాలతో సాగే గ్రంధాల వైభవం పండిత పామరులను ఎలా ఆకట్టుకుంటుందో లక్షల కొలదీ పాఠకులకు ఎరుకే. ఆధ్యాత్మికం, సాహిత్యం, కళలు, చరిత్ర, సంస్కృతి, విద్య, విజ్ఞాన సమాజాలకు సంబంధించిన ఎందరో పురాణపండ శ్రీనివాస్ భాషాసంస్కారాన్ని, నాణ్యాత ప్రమాణాల ముద్రణనీ అభినందిస్తూనే ఉండటం ఇప్పటి రెండు తెలుగు రాష్ట్రాల మేధో సమాజానికీ బాగా తెలుసున్న విషయమే. అలాంటి శ్రీనివాస్ అపురూపంగా అందించిన అమృత కలశమే... ఈ ‘ఓం నమో నారసింహాయ’ గ్రంధం. నాడు ఈ గ్రంధాన్ని స్వయంగా తన ఛాంబర్‌లో తోటి కాంగ్రెస్ మిత్రుల, నాయకుల మధ్య ఆవిష్కరించిన విషయం తెలిసిన గాంధీభవన్ కాంగ్రెస్ వర్గాలు పొన్నాల లక్ష్మయ్య పర్సనల్ అసిస్టెంట్ వెంకట రమణపై ఒత్తిడి తెచ్చి మరీ గాంధీభవన్‌కు ఈ గ్రంథ రాశిని ఆహ్వానించుకుని రెండేసి బుక్స్ చొప్పున తీసికెళ్ళి సంతోషపడిన సంఘటనకు గాంధీభవన్ ముందున్న గంభీర వదనపు మహాత్మా గాంధీ విగ్రహమే సాక్షి. అప్పట్లో పొన్నాల చేసిన పుణ్యం ఇప్పటికీ కొందరు ప్రముఖుల నోటా నానుతూనే ఉంది. ఈ కథంతా ఒక ఎత్తయితే పురాణపండ శ్రీనివాస్ చేసే మహత్కార్యాలు మామూలుగా వుండకపోవడానికి... ఈ పవిత్రకార్యాలకు ఎక్కడా శ్రీనివాస్ వ్యాపార స్వార్ధాన్ని ఇంచుకైనా తాకనివ్వరు. అందుకే శ్రీనివాస్ అపురూప గ్రంధాలకు ఇప్పటికీ అంత క్రేజ్.

POnnala-3.jpg

మళ్ళీ ఇన్నాళ్లకు పొన్నాల లక్ష్మయ్య, తానున్న తెలంగాణ రాష్ట్ర సమితి అనబడే బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, గత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దంపతుల చిత్రాలతో ఒక విలువైన గ్రంధాన్ని శ్రీవైష్ణవ క్షేత్రాలకు, నృసింహ క్షేత్రాలకు, ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణులకు, ప్రధాన నాయికా నాయకులకు అందించాలనే తపనతో ఒక నృసింహ తేజస్సును గ్రంధ రూపంలో ప్రచురించి బహూకరించాలని సంకల్పించినట్లు బీఆర్‌ఎస్ శ్రేణుల్లో సమాచారం నడుస్తోంది. ఎంత ఉన్నత పదవిలో ఉన్నా, ఎన్ని కోట్లు వెనకేసుకున్నా మనం చేసిన పుణ్య కార్యాలే మనతో వస్తాయన్న సత్యాన్ని మరొకసారి నిరూపిస్తున్న పొన్నాల లక్ష్మయ్య దివ్య గ్రంధం కోసం తెలంగాణ శ్రేణులంతా ఎదురు చూస్తున్నాయి.

POnnala-2.jpg

అందులోనూ జాతీయ స్థాయిలో సంచలనాలు సృష్టించి, వేల వేల గ్రంధాల వెల్లువతో తరిస్తున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనం కాబట్టి మరొక అద్భుత గ్రంధమే అవతరిస్తుందని పొన్నాల లక్ష్మయ్య వర్గీయులు బాహాటంగానే చెబుతున్నారు. యాదాద్రి మీద కేసీఆర్‌కి ఉన్న పూజ్య భావమ్ ఎంతో అందరికీ తెలుసున్న విషయమే కాబట్టి ఈ క్రొత్త పవిత్ర గ్రంధం కూడా అన్ని విలువలతో పురాణపండ రూపొందిస్తారని తెలంగాణాకు చెందిన కొందరు పండితుల ఉవాచ.

Ponnala-Lakshamaiah.jpg

Updated Date - Apr 25 , 2024 | 05:50 AM