Share News

Medchal: చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ యువకులు అరెస్ట్

ABN , Publish Date - Jan 24 , 2024 | 10:28 AM

జిల్లాలోని దుండిగల్ పీఎస్ పరిధిలో చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ల్యాప్‌టాప్‌లు దొంగిలించి వాటిని యాప్‌ల ద్వారా విక్రయిస్తున్నారు. నిందితుల్లో ఒకరు ఇంజనీరింగ్ విద్యార్థి కావడం గమనార్హం.

Medchal: చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ యువకులు అరెస్ట్

మేడ్చల్: జిల్లాలోని దుండిగల్ పీఎస్ పరిధిలో చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ల్యాప్‌టాప్‌లు దొంగిలించి వాటిని యాప్‌ల ద్వారా విక్రయిస్తున్నారు. నిందితుల్లో ఒకరు ఇంజనీరింగ్ విద్యార్థి కావడం గమనార్హం. యూపీకి చెందిన రాజ్‌ కుమార్‌తో కలిసి అపాలా బాలాజీ అనే విద్యార్థి క్యాషిఫై(Cashif) అనే యాప్ ద్వారా దొంగిలించిన ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను విక్రయించాడు. యువకులను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోగా యాప్ డీలర్ పర్వేన్ కుమార్ పరారీలో ఉన్నాడు. నిందితులు రాజ్ కుమార్, బాలాజీ వద్ద నుంచి పోలీసులు 20 ల్యాప్ టాప్‌లు, 23 మొబైల్ ఫోన్లు, ఒక హోండా యాక్టివా ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.10 లక్షలుగా ఉంటుందని అంచనా. నిందితులు బాలాజీ, రాజ్‌కుమార్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Jan 24 , 2024 | 10:28 AM