Share News

TS DSC: మెగా డీఎస్సీకి నోటిఫికేషన్‌.. ఒకటికి మించి పరీక్షలు రాయాలంటే..?

ABN , Publish Date - Mar 01 , 2024 | 04:37 AM

మెగా డిస్సీకి నోటిఫికేషన్‌ వచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం స్వయంగా సీఎం రేవంత్‌ గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. గత ప్రభుత్వం 5,089 ఖాళీలతో విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రేవంత్‌ సర్కారు రద్దు చేసి,

TS DSC: మెగా డీఎస్సీకి నోటిఫికేషన్‌.. ఒకటికి మించి పరీక్షలు రాయాలంటే..?

  • ‘మెగా’ నోటిఫికేషన్‌

  • టీచర్‌ పోస్టులకు 4 నుంచి దరఖాస్తులు.. ఏప్రిల్‌ 2వరకు గడువు

  • గతంలోనే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ చేయనక్కర్లేదు

  • రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాల్లో పరీక్షలు.. త్వరలో తేదీల ఖరారు

  • 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ను స్వయంగా విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

  • టీచర్‌ పోస్టులకు.. మార్చి 4 నుంచి దరఖాస్తులు!..

  • ఏప్రిల్‌ 2వ తేదీ దాకా గడువు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీకి (Mega DSC) నోటిఫికేషన్‌ వచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం స్వయంగా సీఎం రేవంత్‌ (CM Revanth Reddy) గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. గత ప్రభుత్వం 5,089 ఖాళీలతో విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రేవంత్‌ సర్కారు రద్దు చేసి, అదనపు పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చింది. తాజాగా విడుదలైన నోటిఫికేషన్‌లోని వివరాల ప్రకారం.. గతంలో టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవక్కర్లేదు. మునుపు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఒకటికి మించి అయితే..?

డీఎస్సీలో భాగంగా ఓ అభ్యర్థి ఒకటికి మించి పరీక్షలు రాయాలనుంటే అన్నింటికీ వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి దరఖాస్తుకు ఫీజు రూ.1000గా నిర్ణయించారు. టీచర్‌ పోస్టుల భర్తీలో 95 శాతం స్థానికతను అమలు పరచనున్నారు. ఆయా జిల్లాల్లోని పోస్టులకు రోస్టర్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. 20 మార్కులతో టెట్‌ వెయిటేజీ ఉంటుంది. రాత పరీక్షను 80 మార్కులకు పెడతారు. ప్రశ్నకు అర మార్కు చొప్పున మొత్తంగా 160 ప్రశ్నలుంటాయి. మొత్తంగా 100 మార్కులకు అభ్యర్థులు మెరిట్‌ జాబితాను రూపొందించి.. దాని ఆధారంగా ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని డీఎస్సీ ఈ నియామకాలను చేపట్టనుంది. చివరదశలో ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర స్థాయిలో వెరిఫికేషన్‌ చేస్తారు. ఒక్కో పోస్టులకు ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం బీఈడీ అభ్యర్థులు కేవలం స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకే అర్హులు. ఎస్టీటీ పోస్టులకు అర్హులు కారు. డీఎడ్‌ చేసిన అభ్యరులే ఎస్జీటీ పోస్టులకు పోటీపడతారు.

Mega-DSC-1.jpg

వయోపరిమితి ఎంత?

గత నోటిఫికేషన్‌తో పోల్చితే తాజా నోటిఫికేషన్‌లో వయోపరిమితిని రెండేళ్లు పెంచారు. ఈ మేరకు టీచర్‌ పోస్టుల అభ్యర్థి వయసు 01/07/2023 నాటికి 18 ఏళ్ల నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి. ఎక్స్‌ సర్వీ్‌సమెన్‌ కేటగిరీ వారికి మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈడబ్ల్యూఎస్‌, ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, పీహెచ్‌సీలకు 10 ఏళ్ల వెసులుబాటు ఉంటుంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే యూనిట్‌గా పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షను కంప్యూటర్‌ బెస్డ్‌ రిక్ర్యూట్‌మెంట్‌ టెస్ట్‌ (సీబీఆర్‌) పద్ధతిలో ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, సంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 11 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకునే సమయంలోనే పరీక్ష కేంద్రాన్ని కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. మెగా డీఎస్సీని ప్రకటించినందుకు పీఆర్టీయూ నాయకులు శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్‌రావు సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు

Mega-DSC.jpg

పోస్టు పేపరు ఖాళీలు

  • స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629

  • లాంగ్వేజ్‌ పండిట్‌ 727

  • ఫిజికల్‌ ఎడ్యుకే షన్‌ 182

  • ఎస్జీటీ 6,508

  • ఎస్‌ఏ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 220

  • ఎస్‌జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796

  • మొత్తం 11,062

జిల్లాల వారీగా పోస్టుల వివరాలు

  • ఆదిలాబాద్‌ 324

  • కొత్తగూడెం 447

  • హనుమకొండ 187

  • హైదరాబాద్‌ 878

  • జగిత్యాల 334

  • జనగాం 221

  • జయశంకర్‌ 237

  • గద్వాల 172

  • కామారెడ్డి 506

  • కరీంనగర్‌ 245

  • ఖమ్మం 575

  • కొమురం బీం 341

  • మహబుబాబాద్‌ 381

  • మహబూబ్‌నగర్‌ 243

  • మంచిర్యాల 288

  • మెదక్‌ 310

  • మెడ్చెల్‌ 109

  • ములుగు 192

  • నాగర్‌కర్నూలు 285

  • నల్లగొండ 605

  • నారాయణపేట 279

  • నిర్మల్‌ 342

  • నిజామాబాద్‌ 601

  • పెద్దపల్లి 93

  • రాజన్న సిరిసిల్ల 151

  • రంగారెడ్డి 379

  • సంగారెడ్డి 551

  • సిద్దిపేట 311

  • సూర్యాపేట 386

  • వికారాబాద్‌ 359

  • వనపర్తి 152

  • వరంగల్‌ 301

  • యాదాద్రి 277

  • మొత్తం 11,062

Updated Date - Mar 01 , 2024 | 08:00 AM