Share News

KCR: ప్రతిపక్ష నేత హోదాలో తొలిపర్యటన చేస్తున్న కేసీఆర్

ABN , Publish Date - Mar 31 , 2024 | 01:06 PM

జనగామ: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిపర్యటన చేస్తున్నారు. జనగామ, దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. రోడ్డు పక్కనే ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించి బాధిత రైతులతో ఆయన మాట్లాడారు.

KCR:  ప్రతిపక్ష నేత హోదాలో తొలిపర్యటన చేస్తున్న కేసీఆర్

జనగామ: బీఆర్ఎస్ అధినేత (BRS Chief), మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Ex CM KCR) ప్రతిపక్ష నేత హోదాలో తొలిపర్యటన చేస్తున్నారు. జనగామ (Janagama), దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. రోడ్డు పక్కనే ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించి బాధిత రైతులతో (Farmers) ఆయన మాట్లాడారు. నీటి ఇబ్బందుల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ వెంట మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పొన్నాల లక్ష్మయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్ మాలోత్ కవిత, గండ్ర వెంకటరమణ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి తదితరులు ఉన్నారు.

మధ్యాహ్నం 1 గంటకు కేసీఆర్ సూర్యాపేటలో భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 3 గంటలకు సూర్యాపేట పార్టీ ఆఫీస్‌లో ప్రెస్ మిట్ నిర్వహిస్తారు. 4 గంటలకు సాగర్ ఆయకట్టులో ఎండిన పొలాలను పరిశీలించి తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరతారు. దీనికి సంబంధించి పార్టీ నాయకులు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. కాగా పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటిస్తుండడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Mar 31 , 2024 | 01:06 PM