Share News

Telangana: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. ఎంపీ రాజీనామా.. ఆ పార్టీలో చేరిక..

ABN , Publish Date - Feb 29 , 2024 | 04:54 PM

తెలంగాణలో అధికారం కోల్పోయి ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్ కు వరస షాక్ లు తగులుతున్నాయి. గులాబీ పార్టీ నుంచి బీజేపీ, కాంగ్రెస్ లోకి చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిపోతోంది. తాజాగా నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ రాములు,

Telangana: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. ఎంపీ రాజీనామా.. ఆ పార్టీలో చేరిక..

తెలంగాణలో అధికారం కోల్పోయి ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్ కు వరస షాక్ లు తగులుతున్నాయి. గులాబీ పార్టీ నుంచి బీజేపీ, కాంగ్రెస్ లోకి చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిపోతోంది. తాజాగా నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ లు బీజేపీలో చేరారు. ఇంఛార్జ్ తరుణ్ చుగ్, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో కాషాయ జెండా కప్పుకున్నారు. పార్టీ సభ్యత్వం అందుకున్నారు. వీరితో పాటు లోక్ నాథ్ రెడ్డి, రఘునందన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డిలు బీజేపీలోకి చేరారు.

ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ మచ్చలేని మనిషి ఎంపీ రాములు అని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీది ముగిసిపోయిన అధ్యాయం అని, అది మునిగిపోయిన పడవ అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నియంతృత్వ పాలన భరించలేక ప్రజలు ఓడించారన్నారు. ఎంపీ రాములు సేవలు బీజేపీకి ఎంతో అవసరం అవుతాయని వ్యాఖ్యానించారు. పదేళ్లలో ప్రధాని మోదీ చేసిన సంక్షేమ పథకాలే.. రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలు గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.


రోజు దేశంలో ఏదో ఒక ప్రాంతం నుంచి సమాజం కోసం పనిచేసే వారు బీజేపీలో చేరుతున్నారు. ప్రధాని నేతృత్వంలో పదేళ్లలో పేదరికానికి వ్యతిరేకంగా మోదీ యుద్ధం చేస్తున్నారు. పేదలకు ఇళ్లు, గ్యాస్, నీళ్లు, మరుగుదొడ్లు నిర్మిస్తున్నారని తరుణ్ చుగ్ వివరించారు. దేశ ఖ్యాతి, వికసిత భారత్ లక్ష్యాన్ని, పేదరిక నిర్ములన కోసం ప్రధాని చేస్తున్న పనిని చూసి చూసి బీజేపీలో చేరుతున్నట్లు ఎంపీ రాములు స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 29 , 2024 | 04:54 PM