Share News

MP Ramasahayam: ‘సీతారామ’పై బీఆర్‌ఎస్‌వి పచ్చి అబద్దాలు..

ABN , Publish Date - Aug 16 , 2024 | 12:51 PM

ఉమ్మడి ఖమ్మంజిల్లాలో సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన సీతారామ ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్‌ నాయకులు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి(Khammam MP Ramasahayam Raghuram Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

MP Ramasahayam: ‘సీతారామ’పై బీఆర్‌ఎస్‌వి పచ్చి అబద్దాలు..

- ఎంపీ రాఘురాంరెడ్డి ధ్వజం

- మంత్రి తుమ్మల ప్రత్యేక దృష్టితోనే ప్రాజెక్టు పూర్తి

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మంజిల్లాలో సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన సీతారామ ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్‌ నాయకులు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి(Khammam MP Ramasahayam Raghuram Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కూసుమంచిలోని మంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.

ఇదికూడా చదవండి: Hyderabad: 4 నెలల్లో రూ.6,894 కోట్ల ఆదాయం


కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం 20శాతం మాత్రమే పనులు చేసిందని, బీఆర్‌ఎస్‌(BRS) హాయాంలోనే 80శాతం పనులు అయినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 19వేల కోట్లలో బీఆర్‌ఎస్‌ రూ.7వేల కోట్లు ఖర్చుచేసిందని, 40శాతం పనులు మాత్రమే చేసిందని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మూడునెలల కాలంలో 500కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. రెండేళ్లలో మొత్తం ప్రాజెక్టుల పూర్తిచేసి నీళ్లు అందించనున్నట్లు తెలిపారు.


సీనియర్‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Senior Minister Tummala Nageswara Rao) సీతారామ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టారని అన్నారు. తుమ్మలపైనా కూడా కామెంట్‌ చేశారని అన్నారు. రైతు రుణమాఫీ హామీని నిలబెట్టుకుంటున్నట్లు ఎంపీ తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడునెలల్లో అన్ని గ్యారంటీలను అమలు చేసిన ఘనత ఉందన్నారు. బీఆర్‌ఎస్‌(BRS) అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఏ ఒక్క వాగ్దానం అమలు చేయలేకపోయారని అన్నారు. పక్కా ఇళ్లు కానీ, రుణమాఫీ కానీ చేయలేకపోయరని విమర్శించారు.


ప్రతిపక్ష నాయకులు తమను పనిచేయనియ్యాలని, మంచి చేస్తే చేయనియ్యాలని అడ్డుకోవడం తగదని హితవు పలికారు. అధికారం నుంచి దించి ఇంట్లో కూర్చోబెట్టినా బుద్దిరావడం లేదని విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కూసుమంచి క్యాంపుకార్యాలయంలో జాతీయపతాకాన్ని ఎంపీ రఘురాంరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 16 , 2024 | 12:51 PM