Share News

MLA: ప్రజల మనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలు సహించం..

ABN , Publish Date - Dec 27 , 2024 | 08:34 AM

తెలంగాణలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ఆంధ్రప్రాంత వాసులపై వివాదాస్పద వ్యాఖ్య లు చేసిన నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వ్యాఖ్యలు గర్హనీయమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) అన్నారు.

MLA: ప్రజల మనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలు సహించం..

- ఎమ్మెల్యే మాధవరం

హైదరాబాద్: తెలంగాణలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ఆంధ్రప్రాంత వాసులపై వివాదాస్పద వ్యాఖ్య లు చేసిన నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వ్యాఖ్యలు గర్హనీయమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) అన్నారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు శిక్షణ తరగతుల్లో నేర్చుకుంది ఇదేనా కనీసం

ఈ వార్తను కూడా చదవండి: JNTU: ‘పట్ట’నంత నిర్లక్ష్యం.. సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల పడిగాపులు


ఏం మాట్లాడుతున్నాం అనే విజ్ఞత లేకపోవడం చాలా దురదృష్టం కరమన్నారు. హైదరాబాద్‌ మహానగరంలో సినీ పరిశ్రమ ద్వారా లక్షల మంది ఉపాధి పొందుతున్నారని అందరూ మన బిడ్డలేనని దచేసి ఆంధ్ర, తెలంగాణ భావన తేవద్దని హితవు పలికారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే భూపతిరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

city7.jpg


కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి భూమిపూజ

ఫతేనగర్‌ డివిజన్‌ గౌతమ్‌నగర్‌లోని ఆల్‌ అన్సారి సొసైటీ ఆధ్వర్యంలో 210 గజాలలో వారిసొంత స్థలంలో నిర్మించ తలపెట్టిన కమ్యూనిటీ హాల్‌ పనులను గురువారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao), కార్పొరేటర్‌ సతీష్ గౌడ్‌ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతే పేద ప్రజల వివాహాల కోసం కమ్యూనిటీహాల్‌ నిర్మించడం అభినందనీయమని కమిటీ సభ్యులను అభినందించారు. కమిటీ హాల్‌ నిర్మాణానికి తనవంతు సహకారాన్ని అందిస్తామన్నారు. కార్యక్రమంలో జహీర్‌ సల ఉద్దీన్‌, అధ్యక్షుడు ఎండీగౌస్‌, ఉపాధ్యక్షుడు యూసఫ్‌, ఎండీ ఖలీల్‌ గోరేమియా, నిస్సార్‌, అహ్మద్‌, ఎండీ ముజీబ్‌, అక్రం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 08:34 AM