Share News

Andole: అందోల్‌లో దామోదర్ పర్యటన.. రంగనాథుడికి ప్రత్యేక పూజలు

ABN , Publish Date - May 26 , 2024 | 07:24 PM

అందోల్‌లో అట్టహసంగా జరుగుతున్న శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయ(Andole Ranganatha Swami Temple) బ్రహ్మోత్సవాలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ(Damodar Rajanarsimha) ఇవాళ(ఆదివారం)హాజరయ్యారు.

Andole: అందోల్‌లో దామోదర్ పర్యటన.. రంగనాథుడికి ప్రత్యేక పూజలు

అందోల్: అందోల్‌లో అట్టహసంగా జరుగుతున్న శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయ(Andole Ranganatha Swami Temple) బ్రహ్మోత్సవాలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ(Damodar Rajanarsimha) ఇవాళ(ఆదివారం)హాజరయ్యారు.

ad1.jpg

ఈ సందర్భంగా ఆయన రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. దామోదర రాజనర్సింహ చొరవతో 1992లో రంగనాథ ఆలయం నుంచి నాచారంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి చెంతకు తరలించిన పంచలోహ విగ్రహాలను తిరిగి రంగనాథుడి చెంతకు చేర్చారు.


బ్రహోత్మవాల్లో భాగంగా ఆలయంలో శాంతి పాఠం, యాగశాల ప్రవేశం, గరుడ హోమం, ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించారు. దామోదర రాజనర్సింహ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి విశేష పూజలు చేశారు.

ad2.jpg

ఆలయ అభివృద్ధి కోసం తాను కృత నిశ్చయంతో ఉన్నానని.. దేవాలయ అభివృద్ధితోపాటు మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు.

Andole: నారసింహుడి నుంచి రంగనాథుడి చెంతకు విగ్రహాలు.. 30 ఏళ్ల తరువాత చారిత్రక ఘట్టం

Andole:అందోల్‌లో వెయ్యేళ్ల నాటి అద్భుత శిల్పాలు!

For Latest News and Telangana News click here

Updated Date - May 26 , 2024 | 07:28 PM