Manda Krishna Madiga: వర్గీకరణను వ్యతిరేకించే వారందరినీ శత్రువులుగా చూస్తాం..
ABN , Publish Date - Dec 03 , 2024 | 07:18 AM
వర్గీకరణను వ్యతిరేకించే వారందరినీ తాము శత్రువులుగానే చూస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ(Manda Krishna Madiga) అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను ఏ పార్టీ వ్యతిరేకించడం లేదని, ఎవ్వరూ అడ్డుకోలేరని అన్నారు.
- మంద కృష్ణ మాదిగ
హైదరాబాద్: వర్గీకరణను వ్యతిరేకించే వారందరినీ తాము శత్రువులుగానే చూస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ(Manda Krishna Madiga) అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను ఏ పార్టీ వ్యతిరేకించడం లేదని, ఎవ్వరూ అడ్డుకోలేరని అన్నారు. మాలలను భ్రమలో పెట్టకుండా, పక్కదారి పట్టించకుండా మీకు చేతనైతే కాంగ్రెస్(Congress) పార్టీకి రాజీనామా చేసి వర్గీకరణను వ్యతిరేకించే పార్టీలో చేరండి లేదా మీరే ఒక పార్టీ పెట్టుకోండని ఆయన అన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: 21 ఏళ్ల పిల్లి మృతి.. కన్నీటి పర్యంతమైన యజమానులు

వర్గీకరణను వ్యతిరేకించే వారు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని పిలుపునిచ్చారు. మాలలది తొండి ఆట అని, వారు సైకోలుగా మారారని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు, రిజర్వేషన్లకు ఇంకా అడ్డు తగులుతామని చెప్పే మనువాదులకి సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఆయిల్ పామ్ సాగు బాట పట్టారు..
ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు
ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..
ఈవార్తను కూడా చదవండి: ఎస్ఐ సూసైడ్ వ్యవహారంలో సంచలన విషయాలు
Read Latest Telangana News and National News