Share News

TG Politics: ఆ విషయంలో రేవంత్‌ సర్కాకు మందకృష్ణ వార్నింగ్

ABN , Publish Date - Mar 23 , 2024 | 09:22 PM

రేవంత్‌ పాలన మీద మాదిగల తిరుగుబాటు ఎలా ఉంటుందో భవిష్యత్‌లో చూపిస్తామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ(Manda Krishna Madiga) హెచ్చరించారు. మాదిగలను రెచ్చగొడితే.. జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మీద సీఎం రేవంత్ చేయించింది డూప్లికేట్ యుద్ధమేనని ఎద్దేవా చేశారు.

TG Politics: ఆ విషయంలో రేవంత్‌ సర్కాకు మందకృష్ణ వార్నింగ్

హైదరాబాద్: రేవంత్‌ పాలన మీద మాదిగల తిరుగుబాటు ఎలా ఉంటుందో భవిష్యత్‌లో చూపిస్తామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ(Manda Krishna Madiga) హెచ్చరించారు. మాదిగలను రెచ్చగొడితే.. జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మీద సీఎం రేవంత్ చేయించింది డూప్లికేట్ యుద్ధమేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌లా రేవంత్ కూడా తమకు అన్యాయం చేస్తే ప్రత్యక్ష యుద్ధమే ఉంటుందని అన్నారు. కేసీఆర్ మాదిరిగానే తప్పులు చేస్తే.. రేవంత్ సీఎం కుర్చీ కూడా పోతుందని అన్నారు. కాంగ్రెస్ నేత సంపత్ కుమార్‌కి వెన్నుపోటు పొడిచింది రేవంత్ రెడ్డినే అని చెప్పారు. తమ నల్ల కండువా మారలేదని.. రేవంత్ మెడలో ఎన్ని కండువాలు మారాయో తెలుసుకోవాలని అన్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... మాదిగలపై రేవంత్‌కి ఎంత ప్రేమ ఉందో ఇటీవల మాట్లాడిన వీడియోలను చూపించారు. కాంగ్రెస్‌లో తమకు అన్యాయం జరుగుతుందని గతంలో తాను మీడియాలో చెప్పానని.. తీరా తమ కులానికి న్యాయం చేయకపోగా తమపై... తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో కౌంటర్ చెప్పించారని అన్నారు. ఓ వైపు మాదిగలే తనకు రాజకీయంగా అండదండలుగా నిలిచారని రేవంత్ చెప్పారని.. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు.

సంపత్‌కు టికెట్ రాకుండా అడ్డుకున్నారు...

ఢిల్లీ పోదాం అన్నారని.. కానీ తీరా రేవంత్ రెడ్డి(Revanth Reddy) తమకు ద్రోహమే చేశారని ధ్వజమెత్తారు. సంపత్‌కు నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ రాకుండా అడ్డుపుల్ల వేసింది.. రేవంత్ రెడ్డినే అని చెప్పారు. సంపత్‌కు నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఇవ్వకుండా మల్లు రవికి ఎందుకు ఇప్పించారని మండిపడ్డారు. నిన్న సంపత్ మాట్లాడిన మాటలు ఆయన మనస్సులోంచి వచ్చిన మాటలు కాదని అన్నారు. రేవంత్ చిలుక పలుకులను సంపత్ నోటా వచ్చాయన్నారు. ఎస్సీ వర్గీకరణకు పోరాటం చేసిన వ్యక్తి సంపత్ అని చెప్పారు. తాను బీజేపీకి మద్దతిస్తున్నానని, మాదిగ జాతిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాళ్ల దగ్గర తాను ఉంచానని సంపత్ అన్నారని చెప్పారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి కూడా మద్దతు ఇచ్చానని అన్నారు. ఆయన ఎస్సీ వర్గీకరణకు సహాయసహకారాలు అందిస్తామని చెప్పారని అన్నారు. అంటే అప్పుడు కూడా మాదిగ జాతిని రాజశేఖరరెడ్డి కాళ్ల దగ్గర పెట్టినట్లా అని ప్రశ్నించారు.

ఇప్పుడు ఎందుకు గుర్తు రావట్లేదు...

2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి రేవంత్ రెడ్డిని ఎంపీగా గెలిపించేందుకు మాదిగలు మద్దతు ఇవ్వలేదా అని నిలదీశారు. కాంగ్రెస్‌లో సీనియర్ నాయకురాలు నిలబడితే ఆమె గెలవడానికి తాము మద్దతు ఇచ్చామని గుర్తుచేశారు. అప్పుడు తాము మా జాతిని మీ కాళ్ల దగ్గర పెట్టినట్టేనా అని ప్రశ్నించారు. తమకు జవాబు ఇవ్వాల్సింది.. సంపత్ కాదని.. రేవంత్ రెడ్డినే అన్నారు. తన ప్రతి గెలుపులో మాదిగల పాత్ర ఉందన్న వ్యక్తికి తాము ఎందుకు గుర్తుకు రావడం లేదని ప్రశ్నించారు. రేవంత్ తమ రుణం తీర్చు కోవాలని అన్నారు. ఆయన సొంత జిల్లాలో మాదిగలకు ఎందుకు టికెట్ ఇప్పించలేక పోయారని మందకృష్ణమాదిగ ప్రశ్నించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 23 , 2024 | 09:22 PM