Share News

Nalgonda: హస్తం గూటికి గుత్తా కుమారుడు, సోదరుడు

ABN , Publish Date - Apr 30 , 2024 | 05:37 AM

మ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎ్‌సకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు అమిత్‌రెడ్డి, ఆయన సోదరుడు జితేందర్‌రెడ్డి కాంగ్రె్‌సలో చేరారు.

Nalgonda: హస్తం గూటికి గుత్తా కుమారుడు, సోదరుడు

నల్లగొండ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎ్‌సకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు అమిత్‌రెడ్డి, ఆయన సోదరుడు జితేందర్‌రెడ్డి కాంగ్రె్‌సలో చేరారు.

సోమవారం ఉదయం హైదరాబాద్‌లో సీఎం నివాసంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో అమిత్‌రెడ్డి, జితేందర్‌రెడ్డికి రేవంత్‌రెడ్డి స్వయంగా కండువాలు కప్పి కాంగ్రె్‌సలోకి ఆహ్వానించారు. అంతకుముందు గుత్తా అమిత్‌రెడ్డి నివాసానికి వెళ్లిన కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదా్‌సమున్షీ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రె్‌సలో చేరాలని ఆహ్వానించారు.


ఇందుకు సుముఖత వ్యక్తం చేసిన అమిత్‌, వారితో కలిసి సీఎం నివాసానికి వెళ్లి అక్కడ పార్టీలో చేరారు. గుత్తా తనయుడు, సోదరుడు పార్టీ మారడంతో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. ఆయన సైతం ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్‌ పాలన బాగుందని కితాబిచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమికి అప్పటి మంత్రుల వైఖరే కారణమని, బీఆర్‌ఎ్‌సలో నియంతృత్వ విధానాలు అమలవుతున్నాయని ఇటీవల విమర్శలు గుప్పించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఆయన పదవీకాలం పూర్తయ్యేంత వరకూ కొనసాగుతారా..? లేక ఆ పదవికి రాజీనామా చేసి కాంగ్రె్‌సలో చేరతారా..? అనే విషయం తేలాల్సి ఉంది.

Updated Date - Apr 30 , 2024 | 05:37 AM